వియ్యంకుడివే కావచ్చు..కానీ : తలసానికి పుట్టా సుధాకర్ హెచ్చరిక..!
ఏపి ముఖ్యమంత్రి..తెలంగాణ ముఖ్యమంత్రి ల మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ ఇప్పుడు ఆ పార్టీల్లోని నేతల మధ్య సంబంధాలపైనా ప్రభావం చూపుతున్నాయి. ఎన్నికల వేళ..బంధుత్వాల కంటే విధేయతే ముఖ్యమని చాటుతున్నారు .తెలంగాణ మంత్రి తలసాని..టిటిడి ఛైర్మన్ పుట్టా సుధకార్ యాదవ్ ఇద్దరూ వియ్యంకులు. ఇప్పుడు తలసాని కొంత కా లంగా చంద్రబాబును టార్గెట్ చేయటం పుట్టాకు ఇబ్బంది గా మారింది. దీంతో..ఆయన ఓ హెచ్చరిక చేసారు..
చంద్రబాబు లక్ష్యంగా తలసాని..
తెలంగాణ ఎన్నికల నుండి తలసాని శ్రీనివాస యాదవ్ రాజకీయంగా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ను లక్ష్యం గా చేసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన రిటర్న్ గిఫ్ట్ వ్యాఖ్యలను తలసాని కొనసాగిస్తున్నారు. సనత్‌నగర్ లో తనను ఓడించేందుకు ప్రయత్నించిన చంద్రబాబును ఏపిలో అధికారంలోకి రాకుండా తాను పోరాటం చేస్తానని తల సాని ఓపెన్ గానే ప్రకటించారు. ఇప్పటికే ఏపి లో రెండు సార్లు పర్యటించారు. ముఖ్యమంత్రి లక్ష్యంగా విమర్శలు చేసా రు.

బిసిలతో సభ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో..తలసాని వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న టిడిపి అధినేత చంద్రబాబు పార్టీలో ఎవరూ తలసాని కార్యక్రమాలకు హాజరు కావద్దని..బంధుత్వాల కంటే పార్టీ ముఖ్యమని హెచ్చరించారు. దీంతో..ఇప్పుడు పార్టీ నుండి రియాక్షన్స్ మొదలయ్యాయి.

వియ్యంకుడివే కావచ్చు..కానీ..
టిటిడి ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్..తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఇద్దరూ వియ్యంకులు. ఇప్పుడు మైదుకూరు సీటు అశిస్తున్న పుట్టా సుధాకర్ నేరుగా తలసానికి హెచ్చిరక చేసారు. వియ్యంకుడివే కావచ్చు..మా సీయం ను విమర్శస్తే సహించను అని స్పష్టం చేసారు. చంద్రబాబు రాజకీయ బిక్షతోనే ఈ స్థాయికి ఎదిగావనే విషయం మరిచి పోవద్దని హెచ్చరించారు యనమల, నేను, నీవు ఈ స్థాయిలో ఉన్నావంటే చంద్రబాబే కారణమనే విషయం మరిచిపో వద్దని సూచించారు. టిటిడికి తొలి సారి గా బిసిలకు ఛైర్మన్ పదవి ఇచ్చారని గుర్తు చేసారు. ఇప్పుడు బంధుత్వాన్ని లింక్ పెట్టి మరీ పుట్టా నేరుగా తలసానిని హెచ్చరించారు. దీని పై తలసాని ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications