త్వరగా లైసెన్స్‌లు ఇవ్వండి: ఏపీలో మద్యం షాప్‌ల వద్ద బారులు
మద్యం దుకాణాల వద్ద ఆదివారం మందుబాబులు బారులు తీరారు. మద్యం కోసం కుస్తీలు పడ్డారు. ఈ సంఘటన విజయవాడ బందర్ రోడ్డులో చోటుచేసుకుంది.
అమరావతి: మద్యం దుకాణాల వద్ద ఆదివారం మందుబాబులు బారులు తీరారు. మద్యం కోసం కుస్తీలు పడ్డారు. ఈ సంఘటన విజయవాడ బందర్ రోడ్డులో చోటుచేసుకుంది.
నూతన మద్యం పాలసీతో ప్రస్తుతమున్న బార్లు, మద్యం దుకాణాల లైసెన్స్‌ల గడువు ముగిసింది. లైసెన్స్ పునరుద్ధరణ జాప్యంతో శనివారం మద్యం దుకాణాలు మూతపడ్డాయి.

ఆదివారం లైసెన్స్‌లు పునరుద్ధరణ కావడంతో కొన్ని దుకాణాలు మాత్రమే తెరుచుకున్నాయి. బందర్ రోడ్డులో కేవలం ఒక్క దుకాణం మాత్రమే తెరవడంతో ఎగబడ్డారు.
గంటల తరబడి దుకాణం ముందు బారులు తీరారు. ప్రభుత్వం మిగతా దుకాణాలకు త్వరగా లైసెన్స్‌లు మంజూరు చేస్తేనే తమ కష్టాలు తీరుతాయని అంటున్నారు.
విజయవాడతో పాటు గుంటూరు తదితర ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తీయగానే మందుబాబులు ఎగబడ్డారు. దీనిని మద్యం వ్యాపారులు కూడా సొమ్ము చేసుకున్నారని అంటున్నారు.
వైన్స్ షాపుల్లో రూ.90 బాటిల్‌ను రూ.150కి విక్రయించి దోచుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రూ.110 ధర ఉండే క్వార్టర్ బాటిల్ ధరను రూ. 170కి అమ్ముతున్నారంటున్నారు.












Click it and Unblock the Notifications