బలి చేస్తావా?: చంద్రబాబుకు సొంత ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య హెచ్చరిక

అమరావతి: రాజకీయ లాభాపేక్ష కోసం బీసీలు బలి కావాలా అని తెలంగాణ రాజధాని హైదరాబాదులోని ఎల్బీ నగర్ సొంత పార్టీ ఎమ్మెల్యే సోమవారం నాడు చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అనంతపురంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాపులను బీసీ జాబితాలో చేరిస్తే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.

అనంతలం మంజునాథ్ కమిషన్ ఎదుట నిరసన

బలిజలను బీసీల్లో చేర్చే అంశంపై మంజునాథ్ కమిషన్ సోమవారం అనంత‌పురంలో చేప‌ట్టిన ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ కార్య‌క్ర‌మంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. లలితకళా పరిషత్‌లో జ‌రుగుతున్న ఈ కార్యక్ర‌మాన్ని బీసీ నేత‌లు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు.

R Krishnaiah warns Chandrababu government over kapu reservations

బ‌లిజ‌ల‌ను బీసీల్లో చేర్చడానికి తాము ఒప్పుకోమని బీసీ సంఘాల నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ర్యాలీగా వ‌చ్చిన‌ దాదాపు రెండు వందల మంది బీసీ నాయకులు ఆందోళ‌న తెలిపారు. కాపు నాయకులు కూడా ప్రతిదాడికి దిగ‌డంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఇరు వ‌ర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరు వ‌ర్గాల‌ను అదుపు చేశారు. ఈ క్ర‌మంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య కూడా తోపులాట జరిగింది. ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ కోసం ఆ ప్రాంతానికి మంజునాథ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ సభ్యులు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+