Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ మీద ఎవరండీ కుట్ర పన్నుతారు?: థియేటర్ల బంద్ పచ్చి అబద్ధం

పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలను అడ్డుకోవడం కోసమే జూన్ 1వ తేదీ నుంచి థియేటర్ల బంద్ ను ప్రకటించినట్లు వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని ప్రముఖ నటుడు, పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అన్నారు. బంద్ అనే విషయాన్ని ఎవరూ చెప్పలేదని స్పష్టం చేశారు.

హరిహర వీరమల్లు సినిమాను ఆపడానికి థియేటర్ల బంద్ కు పిలుపునిచ్చారనే మాట రావడం అనేది ఎంతమాత్రం కరెక్ట్ కాదని, అది దుర్మార్గమని తేల్చి చెప్పారు. బంద్ వెనుక కుట్ర ఉందని, కుట్రదారులు ఎవరో తెలుసుకోవాలంటూ స్వయంగా పవన్ కల్యాణ్ ఆఫీస్ నుంచి, ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ చెప్పడం సరైనది కాదని అన్నారు.

R Narayana Murthy made key remarks on Theaters Bandh

తెలుగు చలన చిత్ర పరిశ్రమ పాలన సంస్థలైన నిర్మాతల మండలి గానీ, ఫిల్మ్ ఛాంబర్ గానీ ఎప్పుడు కూడా థియేటర్ల బంద్ కు పిలుపునివ్వలేదని నారాయణమూర్తి గుర్తు చేశారు. బంద్ అనేది ప్రజాస్వామ్యంలో ఓ బ్రహ్మాస్త్రం వంటిదని ఆయన వ్యాఖ్యానించారు.

బంద్ ను ప్రకటించాల్సిన పరిస్థితే తలెత్తినప్పుడు నిబంధనల ప్రకారం.. మూడు వారాల ముందుగా నోటీస్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. థియేటర్ల బంద్ విషయంలో అలాంటి పరిస్థితి రాలేదని అన్నారు. నిర్మాతల మండలి గానీ, ఫిల్మ్ ఛాంబర్ గానీ బంద్ నోటీసులు ఇవ్వలేదని చెప్పారు.

నిర్మాతలకు ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకూడదనే ఉద్దేశంతోనే మూడు వారాల ముందు బంద్ నోటీస్ ఇవ్వాలని నిర్మాతల మండలిలో గానీ, ఫిల్మ్ ఛాంబర్ లో గానీ నిబంధనలు ఉన్నాయని నారాయణ మూర్తి వివరించారు. అలాంటప్పుడు పహరిహర వీరమల్లుపై కుట్ర చేశారని ఎలా అంటారని ఆర్ నారాయణమూర్తి ప్రశ్నించారు.

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు తరువాత ఆ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని, ఏపీలో ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పవన్ కల్యాణ్ మీద ఎవరండీ కుట్ర పన్నుతారు? అని ప్రశ్నించారాయన. ఎన్టీఆర్ టీడీపీ తరహాలో.. పవన్ కల్యాణ్ జనసేన పార్టీని పెట్టి, ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని ప్రశంసించారు.

ఆయనను చూసి తెలుగు కళామతల్లి, చలన చిత్ర పరిశ్రమ ఎంతగానో గర్విస్తోందని నారాయణమూర్తి అన్నారు. పవన్ కు హ్యాట్సాఫ్ చెప్పారు. పవన్ కల్యాణ్ కు మించి తాము ఏ రకంగా కూడా తురుమ్ ఖాన్ లు కాదని వ్యాఖ్యానించారు. థియేటర్ల బంద్ వ్యవహారంలో మాత్రం.. కుట్రం ఉందని ఆయన ఆఫీస్ నుంచి ప్రకటన రావడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని అన్నారు.

ఒకవేళ థియేటర్ల బంద్ ప్రకటనే వచ్చి ఉంటే- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో మాట్లాడి, చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉందని, పెద్దలతో చర్చలకు ఆహ్వానించి ఉంటే ఒక పెద్దన్నగా ఎంతగానో గౌరవం లభించి ఉండేదని అన్నారు.

మాల్స్, మల్టీప్లెక్సులు వచ్చిన తరువాత సింగిల్ థియేటర్లు తమ ఉనికిని కోల్పోతున్నాయని ఆర్ నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణల్లో 1,000కి పైగా ఉండే సింగిల్ థియేటర్ల సంఖ్య ఇప్పుడు 500ల కంటే తక్కువకు పడిపోయిందని చెప్పారు.

పర్సంటేజీల అంశం దాదాపుగా చిత్ర పరిశ్రమకు సానుకూలంగా కొలిక్కి వచ్చిన దశలో.. ఈ అంశాన్ని హరిహర వీరమల్లు సినిమా విడుదలతో లింక్ చేసి చూడటం దారుణమని అన్నారు. అసలు విషయం పక్కకు వెళ్లి.. వీరమల్లు తెరమీదికి వచ్చిందని వాపోయారు. ఇది సరికాదని పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+