టిడిపి,బిజెపి తోడుదొంగలు..పవన్,జగన్ వీళ్లు ఇద్దరు దొంగలు :బి.వి.రాఘవులు

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

పశ్చిమ గోదావరి జిల్లా: ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసగించడంలో టిడిపి, బిజెపి తోడుదొంగలని, రాజకీయ నాటకాల్లో ఈ రెండు పార్టీల నాయకులకు నంది అవార్డులు ఇవ్వొచ్చని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు ఎద్దేవా చేశారు. సిపిఎం 25వ రాష్ట్ర మహాసభల సందర్భంగా భీమవరం లూథరన్‌ హైస్కూల్‌ ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలో బివి రాఘవులు మాట్లాడారు. అలాగే వైసిపి అధినేత జగన్, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు.

  Is Sonia Gandhi Pawan Kalyan duo mull for AP

  పవన్‌ తన ప్రసంగాల్లో టిడిపిని విమర్శించకుండా బిజెపి గురించే మాట్లాడుతారు...వైసిపి నేత జగనేమో బిజెపి ప్రస్తావన లేకుండా టిడిపిని విమర్శిస్తారు. ఇలా చేయడం నైతికంగా ఏమాత్రం కరెక్ట్ కాదు. ఈ విధానం ప్రజలను తప్పు దోవ పట్టించడమే. పవన్‌ టిడిపి చేసిన మోసం గురించి మాట్లాడాలి. జగన్‌ బిజెపి చేసిన అన్యాయం గురించి విమర్శించాలంటూ అన్ని ప్రధాన పార్టీల నేతలపై బివి రాఘవులు విమర్శల వర్షం కురిపించారు.

  ఇంత జరుగుతుంటే ఏం మాట్లాడకుండా...ఇప్పుడా...

  ఇంత జరుగుతుంటే ఏం మాట్లాడకుండా...ఇప్పుడా...

  రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎపికి బిజెపి అనేక వాగ్దానాలు చేసిందని...అయితే నిధులు మాత్రం కేటాయించలేదంటూ సిపిఎం నేత రాఘవులు ధ్వజమెత్తారు.తాము మొదటి నుంచి రాష్ట్రం సమైక్యంగా ఉండాలని గట్టిగా కోరామన్నారు. విభజన జరిగితే సమస్యలు ఎలా ఉంటాయో అనాడే తమ పార్టీ చెప్పిందన్నారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చేసి ప్రత్యేక హోదా, రాయితీలు ఇస్తామని చెప్పారన్నారు. అయితే ఆ తర్వాత బిజెపి, టిడిపి కుమ్మక్కై హోదా అవసరం లేదు.. ప్యాకేజీ చాలా గొప్పదంటూ చెప్పుకొచ్చారన్నారు. చంద్రబాబు అనేక సందర్భాల్లో ప్యాకేజి అద్భుతమని చెప్పారని రాఘవులు గుర్తు చేశారు. పోలవరానికి రూ.58 వేల కోట్లు అవుతాయని లెక్కలు చెబుతుండగా రూ.వెయ్యికోట్లు కూడా ఇవ్వలేదన్నారు. రూ.16 వేల కోట్ల రెవెన్యూ లోటుకుగాను రూ.మూడు వేల కోట్లు కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక నిధులు ఊసే లేదన్నారు. కడపస్టీల్‌, కాకినాడలో రిఫైనరీ ఏఒక్కటీ లేకుండా పోయాయన్నారు. ఇప్పటి వరకూ అంతా బాగుందని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అన్యాయం జరిగిందంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

  జనసేన, వైసిపి...రెండు పార్టీల నేతలది...మోసపూరిత వైఖరి...

  జనసేన, వైసిపి...రెండు పార్టీల నేతలది...మోసపూరిత వైఖరి...

  రాష్ట్ర ప్రజలను మోసగించడంలో జనసేన, వైసిపి రెండు పార్టీ నేతల వైఖరి ఒక్కటే. రాష్ట్రానికి ఎవరి వల్ల అన్యాయం జరుగుతుందో వారిద్దరి గురించి మాట్లాడినప్పుడే వీళ్లవి నిజాయతీ రాజకీయాలవుతాయి...కానీ వీరిద్దరూ చెరో పార్టీ గురించి మాత్రమే మాట్లాడతారు...ఇంకో పార్టీ గురించి విమర్శించరని ఆరోపించారు. ప్రత్యేకహోదాతో పాటు, పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని హామీల అమలు కోసం వామపక్షాలు రాష్ట్ర విభజన జరిగినప్పటినుండే పోరాడు తున్నాయని, ఎన్నో జెఎసిలు ఉన్నాయని అన్నారు. అయితే పవన్‌ కళ్యాణ్‌ వీటితో కలిసి రాకుండా కొత్తగా జెఎసి అంటున్నారు...అది ఎందుకో అర్ధం కాదు. ఉన్న వాటి తోనే ఆయన కలిసి పనిచేయవచ్చు.' అని అన్నారు.

  కేంద్రంలో...రాష్ట్రంలో...ప్రజాప్రయోజనాలు పట్టని ప్రభుత్వాలు...

  కేంద్రంలో...రాష్ట్రంలో...ప్రజాప్రయోజనాలు పట్టని ప్రభుత్వాలు...

  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఎపికి జరిగిన అన్యాయంపై అందరం కలిసి రాష్ట్రప్రయోజనాలకోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో మోసం చేసి భూములు తీసుకుని అక్కడి పంటపొలాలను నాశనం చేస్తున్నారన్నారు. నీరు, పొల్యుషన్‌, పంటలు దెబ్బతింటాయని తెలిసినా ఆక్వా పరిశ్రమ స్థాపించాలని చూడటం దుర్మార్గమన్నారు. ఏ పరిశ్రమలకు బడితే ఆ పరిశ్రమలకు ఎలా బడితే అలా ఇష్టానుసారం అనుమతులు ఇచ్చేస్తున్నారన్నారంటూ విమర్శించారు. మత్స్యకారులు ప్రయోజనాలు అసలు పట్టకుండా పోయాయన్నారు. పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో తాగునీళ్లు కొనుగోలు చేసి తాగాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. ధ్యాన్యం ఉత్పత్తి కాకపోతే ఆహార భధ్రత ఏవిధంగా ఉంటుందని ప్రశ్నించారు. తుందుర్రు పోరాటం అందరిదని...అంతా కలిసి సంఘీభావం తెలపాలన్నారు...అక్కడ వాళ్లు ఓడితే మనం ఓడినట్టే...వాళ్లు గెలిస్తే మనం గెలిచినట్లే అని రాఘవులు చెప్పారు.

  జనసేన, వైసిపి...రెండు పార్టీల నేతలది...మోసపూరిత వైఖరి...

  జనసేన, వైసిపి...రెండు పార్టీల నేతలది...మోసపూరిత వైఖరి...

  రాష్ట్ర ప్రజలను మోసగించడంలో జనసేన, వైసిపి రెండు పార్టీ నేతల వైఖరి ఒక్కటే. రాష్ట్రానికి ఎవరి వల్ల అన్యాయం జరుగుతుందో వారిద్దరి గురించి మాట్లాడినప్పుడే వీళ్లవి నిజాయతీ రాజకీయాలవుతాయి...కానీ వీరిద్దరూ చెరో పార్టీ గురించి మాత్రమే మాట్లాడతారు...ఇంకో పార్టీ గురించి విమర్శించరని ఆరోపించారు. ప్రత్యేకహోదాతో పాటు, పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని హామీల అమలు కోసం వామపక్షాలు రాష్ట్ర విభజన జరిగినప్పటినుండే పోరాడు తున్నాయని, ఎన్నో జెఎసిలు ఉన్నాయని అన్నారు. అయితే పవన్‌ కళ్యాణ్‌ వీటితో కలిసి రాకుండా కొత్తగా జెఎసి అంటున్నారు...అది ఎందుకో అర్ధం కాదు. ఉన్న వాటి తోనే ఆయన కలిసి పనిచేయవచ్చు.' అని అన్నారు.

  వాటాలకోసమే...పోలవరంపై తొందర

  వాటాలకోసమే...పోలవరంపై తొందర

  త్వరత్వరగా సిమెంట్‌తో గోడలు కట్టేసి తొందరగా 'పోలవరం' పూర్తిచేసి వాటాలు పంచుకోవాలని చూస్తున్నారన్నారు. అంతే తప్ప రెండులక్షల మంది నిర్వాసితుల గురించి ఎపి ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించడం లేదని సిపిఎం రాఘవులు ఆరోపించారు. అంతమందిని ముంచి తినే పాపపు కూడు మనకొద్దన్నారు. పోలవరం తొందరగా పూర్తిచేయాలని తాము కూడా కోరుకుంటున్నామని, కానీ గిరిజనులకు నష్టపరిహారం పూర్తిస్థాయిలో అందించాలనేదే సిపిఎం అభిమతమన్నారు. అందుకు తగిన నిధులు కేటాయించి నిర్వాసితులను కాపాడాలన్నారు. చదువు, ఆరోగ్యంను వ్యాపారంగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోరాటం చేయాల్సి ఉందన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాడాలన్నారు. గుంటూరు పత్తిపాడులో దళితులపై దాడులు, గరగపర్రులో అంబేద్కర్‌ విగ్రహం కూల్చేయడం దారుణమని, ఇలాంటి వాటిని అసలు అంగీకరించకూదన్నారు. దళిత, మైనార్టీ, గిరిజన, మహిళల హక్కులకోసం పోరాడితేనే ప్రజాస్వామ్యం అవుతుందన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  CPI(M) polit bureau member B.V.Raghavulu asked on Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu why he had aligned with the BJP and what he had achieved to Andhra Pradesh as part of the alliance. Addressing the 25th State Conference of the CPI(M) here on saturday, He called upon all parties in the state to launch a united struggle to get fulfilled the State Reorganisation Act 2014 assurances.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి