వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రఘురామ రాజు అనర్హత- లోక్ సభ స్పీకర్ కార్యాలయం క్లారిటీ : వాటితో సంబంధం లేదు..!!

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత అంశం పైన లోక్‌సభ స్పీకర్‌ కార్యాలయ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. సభ్యుడు ఎవరైనా పార్టీ జారీ చేసిన విప్ ఉల్లంఘిస్తేనే అనర్హత నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసాయి. ముఖ్యమంత్రి...ఇతర నేతలపైన విమర్శలు చేసినంత మాత్రాన కాదని తేల్చి చెప్పాయి. లోక్ సభ స్పీకర్ కార్యాలయంలోని ఒక కీలక అధికారి ఇష్టాగోష్టీలో ఈ వ్యాఖ్యలు చేసారు. ఈ వ్వవహారం ప్రస్తుతం సభా హక్కుల సంఘం ముందు ఉందని.. పార్లమెంటరీ నిబంధనల ప్రకారం వాటి పైన చర్చించి కమిటీ అవసరమైన సిఫార్సులు చేస్తుందని చెప్పుకొచ్చారు.

సహా హక్కుల కమిటీ పరిధిలో

సహా హక్కుల కమిటీ పరిధిలో


ఎంపీలపైన థర్డ్ డిగ్రీ ప్రయోగం అన్నది పార్లమెంట్ విధులతో ముడిపడి ఉన్న అంశం కాదని చెప్పుకొచ్చారు. ఏ ఎంపీనైనా పార్లమెంట్ విధుల నిర్వహణ విషయంలో అడ్డుకుంటేనే అది సభా హక్కుల ఉల్లంఘన అవుతుందని స్పష్టత ఇచ్చారు. దాని పైన చట్ట బద్దత ప్రకారం ముందుకెళ్తారని వివరించారు. బయట ఎక్కడైనా గొడవ జరిగితే అది సభ పరిధిలోకి రాదని తేల్చి చెప్పారు. సభ్యుల అనర్హత పిటీషన్ పైన చర్చలకు నిర్దిష్ఠ సమయం లేదన్నారు. ఈ అంశం పైన కమిటీ ఏర్పాటు అయిందని..ఇందులోని విభిన్న అంశాల పైన అధ్యయనం చేస్తోందని వివరించారు.

వైసీపీ నేతల ఫిర్యాదుల్లో

వైసీపీ నేతల ఫిర్యాదుల్లో


ఇక, రఘురామ రాజు విషయంలో సీఎం పైన ఆరోపణలు చేస్తున్నట్లు ఆ పార్టీ ఎంపీలు ఫిర్యాదు చేసారని ..అయితే, ఆ విమర్శలు చేయటం అనర్హథ కిందకు రాదని పేర్కొన్నారు. 10వ షెడ్యూలు నిబంధనలు ఇదే విషయం స్పష్టం చేస్తున్నాయన్నారు. 10వ షెడ్యూలు లో మార్పులు చేయాలని, దాని పైన సమీక్ష జరగాల్సిన అవసరం ఉందని ఇప్పటికే పలువురు సూచనలు చేసారని చెప్పుకొచ్చారు. తమకు అందే అన్ని ఫిర్యాదుల విషయంలో సభా హక్కుల సంఘం ఒకే విధంగా స్పందిస్తుందన్నారు. బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన సమయంలో 24 గంటల్లోగా సమాచారం ఇవ్వకపోవటంతో దానిని సీరియస్ గా తీసుకొని అధికారులను పిలిపించి సాక్షాలను తీసుకున్నారన్నారు

24 గంటల్లోనే సమాచారం ఇచ్చారు

24 గంటల్లోనే సమాచారం ఇచ్చారు


రఘరామ రాజు అరెస్టు విషయంలో 24 గంటల్లోనే చెప్పారని వెల్లడించారు. అందువల్ల సభా హక్కుల కమిటీ దాన్ని పరిగణనలోకి తీసుకోలేదని లోక్ సభ వర్గాలు స్పష్టం చేసాయి. వైసీపీ చేసిన ఫిర్యాదుల్లోని అంశాలు, రఘురామరాజు ఇచ్చిన వివరణను పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నాయి. దీంతో..చాలా రోజులుగా రఘురామ రాజుపైన అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ చేస్తున్న ఫిర్యాదులు..అభ్యర్ధనల విషయంలో ఇప్పుడు కమిటీ ఏ విధంగా సిఫార్సులు చేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Loksabaha Secretariat sources made it clear that the disqualification rules would apply if anyone violated the whip issued by the party
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X