వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..!
ఇవాళ ఏపీలోని ఉండి నియోజకవర్గంలోని పెదపేటలో రామాలయానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు (raghurama krishnam raju) వెళ్లిన సమయంలో ఆయనతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆయనతో పాటు ఉన్న కూటమి కార్యకర్తలపై దాడులు చేశారు. వారు కూడా దీటుగానే స్పందించారు. దీంతో రఘురామకృష్ణంరాజు ఈ దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నారు. దీనిపై రఘురామరాజుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఘాటుగా స్పందించారు.
శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఉదయం ఆకివీడు పెదపేటలోని రామాలయానికి రామ భక్తులతో కలిసి వెళ్లానని, దళిత ముసుగులో ఉన్న క్రైస్తవులు తాను రాముల వారిని దర్శనం చేసుకుంటున్న సమయంలో పెద్దగా కేకలు వేసి, అక్కడి నుండి బయలుదేరిన వెంటనే ఆలయం వద్ద ఉన్న రామ భక్తులపై కత్తులతో దాడి చేసి చాలా మందిపై హత్యా ప్రయత్నం చేశారని రఘురామ తెలిపారు. ఇటీవల గౌరవ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అనుసరించి వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు పండుగ రోజున, హిందూ దేవాలయంలో హిందువులపై ఈ దాడులు చేయించిన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలన్నారు.

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఈరోజు ఉదయం ఆకివీడు పెదపేటలోని రామాలయానికి రామ భక్తులతో కలిసి వెళ్లాను. దళిత ముసుగులో ఉన్న క్రైస్తవులు నేను రాముల వారిని దర్శనం చేసుకుంటున్న సమయంలో పెద్దగా కేకలు వేసి, నేను అక్కడి నుండి బయలుదేరిన వెంటనే ఆలయం వద్ద ఉన్న రామ భక్తులపై కత్తులతో దాడి చేసి… pic.twitter.com/wgu3CHTNQj
— K Raghu Rama Krishna Raju (RRR) (@KRaghuRaju) March 27, 2026
మరోవైపు పవన్ కళ్యాణ్ (pawan kalyan)కూడా ఈ ఘటనపై స్పందించారు. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకొనే శ్రీరామ నవమి రోజున, ఆకివీడులో రామాలయానికి పూజలో పాల్గొనేందుకు వెళ్లిన ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు, ఆయన అనుచరులపై, జనసేన నాయకులపై కొంతమంది వ్యక్తులు ఆయుధాలతో దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పండుగ రోజు ఆలయం దగ్గర ఈ దాడి జరగడం వెనుక కుట్ర కోణం ఉన్నట్లుగా అనిపిస్తోందన్నారు.ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించి, దాడి వెనుక ఎవరున్నారో విచారణ జరిపి, చట్టపరంగా కఠినంగా శిక్షించాలని పోలీస్ శాఖకు సూచించారు. ఈ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకొనే శ్రీరామ నవమి రోజున, ఆకివీడులో రామాలయానికి పూజలో పాల్గొనేందుకు వెళ్లిన గౌరవ శాసనసభ ఉప సభాపతి @KRaghuRaju గారిపై, ఆయన అనుచరులపై, జనసేన నాయకులపై కొంతమంది వ్యక్తులు ఆయుధాలతో దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాను.
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) March 27, 2026
పండుగ రోజు, ఆలయం దగ్గర ఈ దాడి జరగడం…
-
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !!












Click it and Unblock the Notifications