పవన్ కళ్యాణ్ కు హర్ష వీణ అల్టిమేటం.. న్యాయం చెయ్యకపోతే జరిగేదిదే.. షాకింగ్ వీడియో!
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం మళ్లీ ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీలో ఉండి, మహిళ పైన లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవ శ్రీధర్ పై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో తాజాగా మరోమారు హర్ష వీణ సంచలనం వీడియోలు రిలీజ్ చేసింది.
జనసేన పార్టీకి హర్షవీణ అల్టిమేటం
రాసలీలల ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, రెండు నెలలు గడిచినా పార్టీ నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో జనసేన పార్టీకి హర్ష వీణ అల్టిమేటం ఇచ్చింది. తక్షణమే తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. ఇప్పటివరకు తనపై చర్యలు తీసుకోకపోవడంతో తను బయట జనాలలో తిరగలేకపోతున్నానని పేర్కొంది.

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని సంచలన వీడియో
జనసేన కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటా ఆమె సంచలన వీడియోలు రిలీజ్ చేసింది. అరవ శ్రీధర్ లైంగిక వేధింపులకు సంబంధించి తాను ఎన్ని వీడియోలను రిలీజ్ చేసిన జనసేన పార్టీ తన సమస్యను పట్టించుకోలేదని, పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అధిష్టానం ఆదేశాలను ధిక్కరించి కార్యక్రమాలలో పాల్గొంటున్న అరవ శ్రీధర్ కు, జనసేన పార్టీకి విలువలు లేవా అంటూ ఆమె ప్రశ్నించింది.
పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన హర్ష వీణ
పవన్ కళ్యాణ్ కు తెలిసే ఇదంతా జరుగుతోందా అంటూ హర్షవీణ పవన్ ను సైతం టార్గెట్ చేసింది. ఎమ్మెల్యే పదవి ఉంది కాబట్టే తనను అరెస్టు చేయడం లేదని, తక్షణమే తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది. పార్టీ కార్యక్రమాలలో పాల్గొనవద్దని ఆదేశించినా, నిన్న రైల్వే కోడూరు లో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాలుపంచుకోవడంతో తాను ఈ వీడియో రిలీజ్ చేస్తున్నట్టు హర్షవీణ పేర్కొంది.
అరవ శ్రీధర్ పై ఆరోపణల విచారణకు త్రిసభ్య కమిటీ
ఇదిలా ఉంటే జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలతో విచారణకు పార్టీ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఆరోపణలు నిజమా కాదా అన్నది తేలేదాకా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కమిటీకి హర్షవీణ వివరణ కూడా తీసుకుంది. ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నామని, అరవ శ్రీధర్ తప్పు చేసినట్టు తేలితే చర్యలు తీసుకుంటామని జనసేన కూడా వెల్లడించింది.
మరోమారు జనసేనను టార్గెట్ చేసిన హర్ష వీణ
ఇదిలా ఉంటే ఇటీవల పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అరవ శ్రీధర్ కూడా పాల్గొనడంతో ఈ ఆరోపణల కథ కంచికి వెళ్లిందని అందరూ భావించారు. అయితే మరోమారు హర్ష వీణ తాజాగా సంచలనం వీడియోను రిలీజ్ చేసి పవన్ పార్టీని టార్గెట్ చేసింది.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications