తెనాలి పోలీసులది తప్పే..కానీ జగన్ నాకు చేసిందేంటి ? రఘురామ ప్రశ్న..!

తెనాలి పోలీసుల దాడిలో గాయపడ్డ బాధితుల కుటుంబాల్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్లడంపై అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. తెనాలి పోలీసులు బహిరంగంగా వారిని కొట్టడాన్ని తప్పుబట్టిన రఘురామ.. అదే సమయంలో గతంలో వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు తనపై చేయించిన దాడిపై ప్రశ్నించారు. గతంలో జరిగిన పలు ఘటనల్ని ఆయన గుర్తుచేశారు.

ఇవాళ తెనాలిలో ఓ గమ్మత్తైన ఘటన జరిగిందని, జగన్ అక్కడ పర్యటించారని రఘురామ తెలిపారు. రౌడీ షీటర్లుగా పేరు పొందిన జాన్ విక్టర్, అతని గ్యాంగ్ పై పలు కేసులు జగన్ హయాం నుంచే ఉన్నాయని వెల్లడించారు. గంజాయి బ్యాచ్, చైన్ బ్యా్ అని వీరికి బిరుదులు కూడా ఉన్నాయన్నారు. తెనాలిలో పేరున్న గంజాయి ముఠాగా విశిష్టమైన ప్రాధాన్యం ఉన్న రౌడీలు ఓ బీసీ హెడ్ కానిస్టేబుల్ పై హత్యాయత్నం చేశారని ఆరోపించారు.

raghurama krishnam raju interesting comments on ys jagan tenali tour admitted police mistake

ఓ హెచ్ కానిస్టేబుల్ మీదే గంజాయి బ్యాచ్ దురాగతం చేస్తే ప్రజల్లోనూ అవగాహన రావాలని రఘురామ తెలిపారు. వీరు జైలుకు వెళ్లడం, తిరిగి రావడం అలవాటుగా మారిపోయిన వారికి ఏ శిక్ష విధించినా తప్పు లేదన్నారు. ఇలాంటి సమయంలోనే చట్టం, న్యాయం వంటివి తెరపైకి వస్తాయన్నారు. అయితే బహిరంగంగా ఇలా చేయడం చట్టానికి వ్యతిరేకమే అన్నారు. గతంలో డాక్టర్ సుధాకర్ ను నడిరోడ్డుపై కొట్టించిన వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి అన్నారు. సుబ్రమణ్యాన్ని పార్శిల్ చేసిన వ్యక్తికి మద్దతిచ్చిన వ్యక్తి కూడా అన్నారు.

అలాంటి వారికి మద్దతు తెలిపేందుకు మాజీ సీఎంగా పనిచేసిన వ్యక్తి గత చరిత్ర చూసినా ఎంపీగా సొంత పార్టీలో ఉన్న తాను సలహా ఇచ్చినందుకు అన్యధా భావించి దారుణంగా చిత్ర హింసలు చేశారన్నారు. దాంతో పోలిస్తే రోడ్డుపై వీరిని కొట్టడం నథింగ్ అన్నారు. తనను ఎంత చిత్రవథ చేశారో అందరికీ తెలిసిందేనన్నారు. ఇప్పుడు దయ్యాలు వేదాలు వల్లించినట్లు తనను కొట్టారన్నారు.

ఇప్పుడు దారుణమైన గంజాయి బ్యాచ్ ను పోలీసులు కొడితే తగుదునమ్మా అంటూ జగన్ వెళ్లడం ఏంటన్నారు. జగన్ ముఖ్యమంత్రి కాకపోయినా ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇలా గంజాయి బ్యాచ్ కు మద్దతునివ్వడం దిగజారుడు ఓట్ల రాజకీయానికి పరాకాష్ట అన్నారు. దీని వల్ల గతంలో వచ్చిన ఓట్లు కూడా రాకుండా పోతాయన్నారు. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయన్నారు. ఓ రాజకీయ నాయకుడు ప్రజా కంటకంగా తయారైన క్రిమినల్స్ పోలీసులు ధర్మం ప్రకారం శిక్షిస్తే ఇలాంటి వెధవలకు తాను ఉన్నానంటూ భుజం తట్టడం ఆత్మహత్యాసదృశ్యం అన్నారు.

Take a Poll

జగన్ పరామర్శించిన జాన్ విక్టర్ ఎస్సీ కాదని, బీసీ సీ అవుతాడని రఘురామ తెలిపారు. ఇతన్ని దళితుడి పేరుతో జగన్ రెచ్చగొడుతున్నారన్నారు. తనను దారుణంగా హింసించిన వ్యక్తులు ఏమీ చేయలేదని తప్పించుకునేందుకు చూస్తున్నారన్నారు. తనపై దాడి చేసిన సునీల్ కుమార్ ను ఇప్పటివరకూ పిలిచి విచారించకపోవడం సముచితం కాదన్నారు. చట్టం పరిధి ఎక్కువ కాబట్టి ఆలస్యమైనా న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+