పాల్ కూడా 175 అంటున్నాడు ! నా లెక్క ఇదే-రఘురామ జోస్యం..!

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి నమోదైన రికార్డు పోలింగ్ శాతం అన్ని పార్టీల్లోనూ ధీమా పెంచేసింది. విజయంపై ఎవరూ తగ్గే పరిస్ధితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు వరకూ వైనాట్ 175 అన్న సీఎం జగన్ కాస్తా గతంలో సాధించిన 151 సీట్ల కంటే ఎక్కువ సీట్లు గెల్చుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు సైతం తాము 140 సీట్ల వరకూ గెల్చుకుంటామని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమికి 120-125 సీట్లు వస్తాయని రఘురామ ఇప్పటికే జోస్యం చెప్పారు.

ఇవాళ మరోసారి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రఘురామకృష్ణంరాజు స్పందించారు. కోనసీమ జిల్లా అయినవిల్లి, వాడపల్లి ఆలయాన్ని దర్శించుకున్న రఘురామ.. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి మంచి పాలన రావాలని అయినవిల్లిలో దేవుడిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో దుష్ట పరిపాలన అంతమవ్వాలని దేవుణ్ణి కోరుకోవడం జరిగిందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు.

raghurama Krishnam raju latest prediction on alliance victory compared ys jagan with ka paul

టీడీపీ కూటమి ఈసారి కనీసం 125 సీట్లు గెల్చుకోబోతోందని రఘురామ అంచనా వేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారిఈ ఆలయాలకు వచ్చి దర్శనం చేసుకొంటానన్నారు. సీఎం జగన్ వైనాట్ 175 నినాదంపై స్పందిస్తూ.. ఇప్పుడు కేఏ పాల్ కూడా 175కు 175 అంటున్నారని రఘురామ ఎద్దేవా చేశారు. అలాగే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం ఘటనపై స్పందిస్తూ.. ఎన్నికల రిగ్గింగ్ అరికట్టడానికి వెళ్తే ఇన్ని కేసులా అని సాక్షిలో వాపోతున్నారని ఆక్షేపించారు. జూన్ 4వ తేదీన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైయస్సార్ సీపీ) పార్టీకి పెద్ద కర్మ నిర్వహించబోతున్నామని రఘురామ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+