వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ మౌనం బద్దలైతే ఊడేదేంటి? - అమిత్ షాతో ఆ విషయమా? స్వరూపానంద మౌనమేల?: ఎంపీ రఘురామ

|
Google Oneindia TeluguNews

నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామృష్ణంరాజు మరోసారి సొంత పార్టీపై, అధినేత వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో మాటలదాడి చేశారు. ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన, తిరుమల సందర్శనపై అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు భవిష్యత్తుపై ధైర్యంగా ఉన్నారంటే అది హైకోర్టు అండవల్లేనని, న్యాయవ్యవస్థపై స్పీకర్ తమ్మినేని సీతారాం దుమ్మెత్తిపోయడం సరికాదని అన్నారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రఘురామ ఏమన్నారంటే..

జగన్ మౌనం బద్దలైతే ప్రళయమే - కోర్టులపై స్పీకర్ తమ్మినేని సంచలనం -చంద్రబాబును మూసేస్తారుజగన్ మౌనం బద్దలైతే ప్రళయమే - కోర్టులపై స్పీకర్ తమ్మినేని సంచలనం -చంద్రబాబును మూసేస్తారు

జగన్ కాదు.. ప్రజల మౌనం..

జగన్ కాదు.. ప్రజల మౌనం..

‘‘పేదలకు ఇళ్ల పట్టాలు ఆపేస్తే కోర్టుల్ని ఏమైనా చేసేస్తారా? ప్రజలు తిరగబడతారా? జగన్ మౌనం బద్దలైతే ప్రళయం వస్తుందా? స్పీకర్ తమ్మినేని సీతారాం ఏం మాట్లాడుతున్నారో తనకైనా అర్థమవుతోందా? జగన్ మౌనం బద్దలైతే ఎవరికీ ఏమీ ఊడిపోదు.. అసలు జగన్ కాదు.. ప్రజలే మౌనంగా ఉన్నారు.. ప్రజల మౌనం బద్దలయ్యే రోజు త్వరలోనే వస్తుంది.. వైసీపీ ప్రళయం అంచుల్లో ఉందన్న సంగతి సీతారాం గుర్తుపెట్టుకోవాలి. ఇళ్ళపట్టాల గురించి మాట్లాడే స్పీకర్ కు అవ భూముల కుంభకోణం గురించి తెలీదా? అమరావతిలో పేదల ఇళ్ల కోసం స్థలం కొనడానికి ఎవరెంత నొక్కేశారో ప్రజలందరికీ తెలుసు. ప్రజలు భవిష్యత్తుపై భరోసాతో ఉన్నారంటే అది ఒక్క హైకోర్టు వల్లే అని అందరూ గుర్తుంచుకోవాలి. అంచేత స్పీకర్ స్థానంలో ఉండి ప్రజాగ్రహానికి గురికావొద్దు..

 సీఎం ఢిల్లీ పర్యటన సిల్లీ..

సీఎం ఢిల్లీ పర్యటన సిల్లీ..

మా ముఖ్యమంత్రిగారు నిన్న ఢిల్లీకి వచ్చారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపు మేరకే వచ్చినట్లు మీడియా చెబుతోంది. 15 నిమిషాల భేటీలో.. ఏపీకి రావాల్సిన నిధుల గురించి హోం మంత్రిని సీఎం అడిగారని తెలిసింది. తన ఢిల్లీ పర్యటనలో ఏపీకి హోదా అంశాన్ని సీఎం ప్రస్తావించలేదు. అయినా.. నిధులు కావాలంటే ఆర్థిక మంత్రిని కలవానిగానీ, హోం మంత్రిని అడగటంలో మతలబు ఏంటి? అమిత్ షాను కలవడం బట్టే జగన్ ఢిల్లీ పర్యటన ఉద్దేశమేంటో అర్థమవుతోంది కదా. ఏపీ ప్రొటెక్షన్ కంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసమే ఆయన ఢిల్లీకి వచ్చినట్లుంది. న్యాయవ్యవస్థను కించపరిచే విషయంలో జగన్ పై అమిత్ షా కోప్పడి ఉండొచ్చు..

 డిక్లరేషన్‌ తోనే వాళ్లకు సమాధానం..

డిక్లరేషన్‌ తోనే వాళ్లకు సమాధానం..

ఢిల్లీ పర్యటన తర్వాత సీఎం జగన్ తిరుపతికి వెళ్లనున్నారు. డిక్లరేషన్ చేశాకే ఆలయంలోకి అడుగుపెట్టాలని బీజేపీ కూడా స్పష్టమైన డిమండ్ చేసింది. నిజంగా దేవుణ్ని నమ్ముతున్నప్పుడు.. చిన్న సంతకం చేయడం ద్వారా విమర్శకుల నోళ్లు శాశ్వతంగా మూయించవచ్చకదా? అన్నది నా డిమాండ్. ఒకవైపు మంత్రులు.. విగ్రహాలు కూలితే ఏమవుతుంది? డిక్లరేషన్ ఎందకు? అని ప్రశ్నిస్తూ హిందువుల మనోభావాలను దారుణంగా అవమానిస్తున్నారు. జగన్ పెట్టే ఒక్క సంతకంతో హిందువుల మనసుల్లో ఆయన స్థానం శాశ్వతం అవుతుందని అనుకుంటున్నాను..

 స్వరూపానంద వల్లే వైసీపీ గెలుపు..

స్వరూపానంద వల్లే వైసీపీ గెలుపు..

అప్పటిదాకా జగన్ పట్ల హిందూ సమాజంలో ఉన్న అభిప్రాయాలు వేరు.. శారదపీఠం అధిపతి స్వరూపానంద ఆగమనం తర్వాత అభిప్రాయలు వేరు. జగన్ హిందులకు రక్షకుడిగా ఉంటాడని స్వరూపానంద అభయం ఇచ్చిన తర్వాతే హిందువులందరూ జగన్ కు ఓటేశారు.. వైసీపీ గెలుపులో స్వరూపానంద పాత్ర ప్రముఖమైనది. మరి అదే జగన్ ఇవాళ తక్షకుడిగా మారిపోయాడు. డిక్లరేషన్ అంశంపై స్వరూపానంద, ఇతర స్వాములు తమ అభిప్రాయాలను వెల్లడించాలి. జగన ఢిలలీ పర్యటనలో ఇంగ్లీషుపైనా చర్చ జరిగింది.. భారతీయ భాషల్ని భూస్థాపితం చేిసి.. పరమతస్తులు మనపై రుద్దిన పరాయి భాషను వద్దన్నందుు నాపై వరుస దాడి చేస్తున్నారు.. కడప వెళ్లిన తర్వాతే కర్నూలు కు వస్తా.. రాష్ట్రమంతా తిరుగుతా.. నా ఊరికి వెళితేనే ఏదో చేస్తారని తోలు వలిచే కార్యక్రమం వద్దని చెబుతున్నాను..

 నన్ను పిచ్చి కుక్కలా చూస్తున్నారు..

నన్ను పిచ్చి కుక్కలా చూస్తున్నారు..

మా పార్టీకే చెందిన అన్యమతస్తుడైన ఓ ఎంపీ.. నా తోలు వలిచేస్తానని, తద్వారా చంపేస్తానని బెదిరిస్తున్నాడు. మా పార్టీ నన్ను పిచ్చికుక్కలాగా, గజ్జి కుక్కలాగా చూస్తోంది. ఆ ఎంపీ కులం ఏమిటో తెలీదు.. బహుశా తోలు వొలవడం ఆయన వృత్తి కావొచ్చు.. నా తోలు వొలవడానికి సెక్యూరిటీ అడ్డుగా ఉంది కాబట్టి దాన్ని తొలగించాలని మాట్లాడుతున్నాడు. ఆయన ఎంత సంస్కారవంతమైన భాషలో మాట్లాడాడో వీడయోలు చూస్తే తెలుస్తోంది. ప్రతివాడూ నన్ను ఛాలెంజ్ చేసేవాడే.. అయినా పర్వాలేదు.. చాలెంజ్ చేసిన అందరి ఊళ్లలో త్వరలోనే పర్యటిస్తా. వైసీపీ పార్టీ, ఎమ్మెల్యేలు నా రక్తం తాగారు.. నన్ను రాజీనామా చేయమనే హక్కు వాళ్లకు లేదు.. నా రక్తాన్ని తిరిగిస్తే.. అప్పుడు రాజీనామాపై ఆలోచిస్తా..'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

అమిత్ షాతో జగన్ సమావేశం - కోలుకున్నాక తొలి భేటీ ఏపీ సీఎంతోనే - ఏం మాట్లాడారంటే..అమిత్ షాతో జగన్ సమావేశం - కోలుకున్నాక తొలి భేటీ ఏపీ సీఎంతోనే - ఏం మాట్లాడారంటే..

English summary
Narasapuram YSRCP rebel MP Raghuramrishnam Raju has once again launched a scathing attack on his own party and its leader YS Jagan. he made unexpected remarks on CM Jagan's visit to Delhi and Tirumala. The mp said that if the people were brave for the future it would not be the High Court and Speaker Tammineni Sitaram on the judiciary was not right to be dirty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X