పవన్ ఫ్యాన్స్ దెబ్బకు రఘురామ యూటర్న్ ! కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు..!
ఏపీలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారశైలి విషయంలో జిల్లా ఎస్పీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయడం, డీజీపీ నివేదిక కోరడం చర్చనీయాంశమైంది. అదే సమయంలో సదరు డీఎస్పీకి మద్దతుగా డిప్యూటీ స్పీకర్ రఘురామ మంచి అధికారి అంటూ క్లీన్ చిట్ ఇవ్వడం అంతకన్నా ఎక్కువగా చర్చకు దారి తీసింది. దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు రఘురామపై ట్రోలింగ్ కు దిగారు. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గిన రఘురామ.. ఇవాళ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇవాళ విశాఖ పర్యటనలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ.. భీమవరం డీఎస్పీ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ చేసిన ఫిర్యాదుపై మరోసారి స్పందించారు. డిఎస్పీ వ్యవహరంపై చెప్పాల్సింది తాను చెప్పానని, విచారణ జరుగుతోందని తెలిపారు. తానేమీ డిఎస్పీకి సపోర్టు చేయడం కాదు, తనకున్న సమాచారం మేరకు మాట్లాడానని పేర్కొన్నారు. తన పరిధిలో, వారానికి ఐదు రోజులు అక్కడే ఉంటున్నానని, తనకు ఎవరూ ఆయనపై కంప్లయింట్ ఇవ్వలేదని గుర్తుచేశారు.

డిఎస్పీపై అన్నీ తనకు తెలియవచ్చు, తెలియకపోవచ్చని రఘురామ తేల్చేశారు. విచారణలో తప్పులు చేసినట్లు తేలితే చర్యలు తీసుకోవచ్చన్నారు. తన పరిధిలో ఉన్న అధికారి మంచిగా పని చేస్తున్నందునే చెప్పపోతే సరికాదని చెప్పానన్నారు.
తన ఇన్ఫరేషన్ కరెక్టు కావచ్చు, కాకపోవచ్చన్నారు. అలాగే పవన్ కల్యాణ్ ఫిర్యాదు కూడా కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చన్నారు.
పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేయడం బాధ్యతగల మంత్రిగా, ప్రజాప్రతినిధిగా ఆలోచించి చేసారన్నారు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్ని తాను సమర్థిస్తున్నట్లు రఘురామ స్పష్టం చేశారు. ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. తాను పవన్ కల్యాణ్ అభిమానినేనని, కొందరు పవన్ అభిమానులు మిస్ అండర్ స్టాండింగ్ చేసుకొంటున్నారని రఘురామ వెల్లడించారు. తద్వారా పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం చల్లార్చేందుకు రఘురామ ప్రయత్నించారు. నిన్న భీమవరం డీఎస్పీకి మద్దతుగా రఘురామ చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడం, దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications