Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

RRR జోస్యం, ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుందంటే?, ఆ పార్టీని ముంచేసిన ఓటర్లు, ఇదే నిజం!

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ పూర్తి అయ్యి రెండు రోజులు అవుతున్నా ఆ వేడి మాత్రం ఇంకా తగ్గడం లేదు. పలు చోట్ల అధికార వైసీపీకి చెందిన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అరాచకపాలన అంతం అవుతోందని, ఆ రోజు నేను జైల్లో చేసిన శపథం నేరవేరుతోందని నరసాపురం ఎంపీ, ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘురామ కృష్ణరాజు జోస్యం చెప్పారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని అమిరంలో మీడియాతో మాట్లాడిన నరసాపురం ఎంపీ రాఘురామ కృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుతవం మీద నిప్పులు చెలిగారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటంలో ఇక ముందు వైసీపీ కనపడదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 150కి పైగా ఎమ్మెల్యే సీట్లు వస్తాయని, అందులో ఎలాంటి అనుమానం లేదని రాఘురామ కృష్ణరాజు చెప్పారు.

Raghurama Krishnaraju said that TDP Janasena BJP coalition government will come in Andhra Pradesh

గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చాయని, అయితే ఈసారి జగన్ ప్రభుత్వానికి ప్రజలు ఓటు అనే ఆయుధంతో చుక్కలు చూపించారని రాఘురామ కృష్ణరాజు అన్నారు. ఎన్నికల్లో ఉద్యోగులు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారని, దేశ చరిత్రలో ఉద్యోగులు ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు వెయ్యడం ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలు వైసీపీ అరాచాలకు చెక్ పెట్టాలని ఓటు వేశారని, ప్రజలు వైసీపీని ముంచేశారని రాఘురామ కృష్ణరాజు చెప్పారు.

గోదావరి జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తోందని, అందులో ఎలాంటి అనుమానం లేదని, ఓడిపోతామని తెలుసుకున్న వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసి ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, జగన్ చేస్తున్న మోసాలను ఆలస్యంగా తెలుసుకున్న మహిళలు పోలింగ్ రోజు వైసీపీ వ్యతిరేకంగా ఓట్లు వేసి నిరసన వ్యక్తం చేశారని రాఘురామ కృష్ణరాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో త్వరలో రాక్షసపాలన అంతం అవుతోందని, కూటమి ప్రభుత్వం కొలువుతీరుతుందని త్రిబుల్ ఆర్ ధీమా వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+