చంద్రబాబును కాపాడింది జగనే ? ఇప్పుడు బుక్..! రఘురామ షాకింగ్..!

ఏపీ రాజకీయాల్లో ఇద్దరు కీలక నేతలు చంద్రబాబు, వైఎస్ జగన్. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు విపక్ష నేతగా ఉండేవారు, ఇప్పుడు చంద్రబాబు సీఎంగా ఉంటే జగన్ విపక్ష నేత హోదా లేకపోయినా విపక్ష పార్టీలో ప్రత్యర్ధిగా ఉన్నారు. అయితే వీరిద్దరికీ సంబంధించిన ఓ విషయంలో ఓ లాజిక్ ఎలా వర్తిస్తుందో, గతంలో ఎలా వర్తించలేదో వివరించే క్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విశాఖలో ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా జగన్ పై అసెంబ్లీకి రానందుకు అనర్హత వేటు వేసే విషయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు స్పందించారు. గతంలో చంద్రబాబు కూడా రెండేళ్ల పాటు అసెంబ్లీకి రాకుండా ఉండిపోయారని, అప్పట్లో ఆయనపై అనర్హత వేటు పడలేదని, ఇప్పుడు మాత్రం జగన్ కు అదే కారణంతో అనర్హత వేటు ఎలా వేస్తారని అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో రఘురామ జవాబిచ్చారు.

Raghurama Raju s logic how Chandrababu escaped Jagan Risks Disqualification for Assembly Absence

ముందుగా జగన్ పై అనర్హత వేటు గురించి స్పందిస్తూ.. ఈసారి అసెంబ్లీ సమావేశాలు 20 రోజులు జరిగితే మాత్రం ఆయనపై వేటు పడటం ఖాయమని రఘురామ తేల్చేశారు. అయితే ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ జరుగుతుందన్న దానిపై జగన్ అనర్హత వేటు ఆధారపడి ఉందన్నారు. వైఎస్ జ‌గ‌న్ అసెంబ్లీకి రాకుండా మాట్లాడితే కుదరదని రఘురామ స్పష్టం చేశారు. రాబోయే సమావేశాల రోజులను బట్టి అనర్హత పరిధిలోకి వస్తారా లేదా అనేది నిర్ణయం ఉంటుందన్నారు.

Raghurama Raju s logic how Chandrababu escaped Jagan Risks Disqualification for Assembly Absence

మరోవైపు చంద్రబాబు గతంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆఖరి రెండేళ్లు సభకు రాలేదని కొంతమంది మాట్లాడటం సరికాదని రఘురామ తెలిపారు. అప్పట్లో చంద్రబాబు అసెంబ్లీకి రాకపోయినా అనర్హత వేటు ఎందుకు పడలేదో రఘురామ వెల్లడించారు. అప్పట్లో రెండేళ్ల పాటు చంద్రబాబు అసెంబ్లీకి రాలేదన్నది వాస్తవమే అయినా, ఆ సమయంలో అసెంబ్లీ 60 పనిదినాలు పని చేయలేదని, అందుకే ఆయనపై అనర్హత వేటు పడలేదని రఘురామ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు జగన్ విషయంలో అలా కాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+