Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజధాని మార్పుకు అదొక్కటే మార్గం-జగన్ కు రఘురామ సలహా ! బుగ్గన ప్రకటన అందుకే ?

ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖ తరలించేందుకు ఒక్కటే మార్గం ఉందని వైసీపీ సర్కార్ కు రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సలహా ఇచ్చారు.

ఏపీలో రాజధాని ఏదనే అంశంపై నిన్న ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రకటన తర్వాత మంత్రులు వరుస ప్రకటనలు చేస్తున్నారు. బుగ్గన కామెంట్స్ పై రేగిన చిచ్చును చల్లార్చేందుకు రంగంలోకి దిగిన మంత్రులు వరుస ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఆయన ప్రకటనకు భిన్నంగానే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని వ్యవహారం, తరలింపుపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు.

 రాజధాని రచ్చపై రఘురామ

రాజధాని రచ్చపై రఘురామ

ఏపీ రాజధాని విశాఖేనని, మూడు రాజధానులు ఏమీ లేవంటూ నిన్న బెంగళూరులో ఆర్ధిక మంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో రాజకీయం మరోసారి రాజుకుంది. బుగ్గన ప్రకటనతో మూడు రాజధానులపై వైసీపీ ఇన్నాళ్లూ చేస్తున్న వాదనపై అనుమానాలు మొదలయ్యాయి. దీంతో మంత్రులు అంబటి, ధర్మాన, సలహాదారు సజ్జల రంగంలోకి దిగి తమ ప్రభుత్వ విధానం మూడు రాజధానులేనంటూ క్లారిటీ ఇస్తున్నారు. మరి బుగ్గన మాటల సంగతేంటని అడిగితే ఆయన చెప్పింది కూడా ఇదేనన్నారు. దీనిపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ ఇవాళ విమర్శలు గుప్పించారు.

 మంత్రుల తలోమాట-జగన్ మౌనం

మంత్రుల తలోమాట-జగన్ మౌనం

రాష్ట్ర రాజధానిపై మంత్రులు పూటకొక మాట మాట్లాడుతుంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమీ మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇవాళ ఆక్షేపించారు.ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు తమకు తోచినట్లుగా మాట్లాడడం విస్మయాన్ని కలిగిస్తోందన్నారు. రాజధాని అంశంపై తన మంత్రివర్గ సహచరులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నప్పటికీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకనీ మాట్లాడడం లేదని రఘురామకృష్ణం రాజు నిలదీశారు. ముఖ్యమంత్రి తో పాటు , మంత్రివర్గ సభ్యులు స్థిరత్వంలో అస్థిరత్వంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మంత్రుల మాటలు చూసి... ప్రజలు మాత్రం ప్రభుత్వ పెద్దల మైండ్ దొబ్బిందని అనుకుంటున్నారని చెప్పారు.

 రాజధాని ఇలా మార్చుకోవచ్చు..

రాజధాని ఇలా మార్చుకోవచ్చు..

రాష్ట్రంలో రాజధాని మార్పు కోసం వైసీపీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలపై స్పందించిన రఘురామ.. ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటైన రాజధానిని తిరిగి అదే పార్లమెంటు చట్ట సవరణతో మార్చుకోవచ్చని సలహా ఇచ్చారు. ఇప్పటికే మాజీ మంత్రి కొడాలి నాని వంటి వారు ఇదే విషయాన్ని స్పష్టం చేసారు. దీన్ని గతంలోనే సమర్ధించిన రఘురామ.. పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేసిన రాజధానిని, తిరిగి పార్లమెంటు చట్టం ద్వారానే మార్చడానికి వీలవుతుందని చెప్పారు. అంతేకానీ బుగ్గన, సజ్జల, ధర్మాన ప్రసాదరావు నోటికొచ్చినట్లు మాట్లాడినంత మాత్రాన రాష్ట్ర రాజధాని మారదన్నారు. మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడితే రానున్న ఎన్నికల్లో ప్రజలు గూబ గుయ్యిమనిపిస్తారని హెచ్చరించారు.

 కేంద్రం చెప్పింది అర్ధం కాలేదా ?

కేంద్రం చెప్పింది అర్ధం కాలేదా ?

రాజధాని కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని, ఈనెల 23వ తేదీ నుంచి వాదనలు ప్రారంభం కానున్నాయని రఘురామ గుర్తు చేశారు. సుప్రీం కోర్టులో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్ ద్వారా అమరావతే రాజధాని అని స్పష్టం చేసిందన్నారు. రాజధాని ఎంపిక కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి, కమిటీ చేసిన సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 5, 6 సెక్షన్ల ప్రకారమే రాజధాని ఎంపిక చేసి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టరన్నారు. శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించాక పార్లమెంటులో చట్టం ద్వారా, రాజధాని ప్రాంతాన్ని ఖరారు చేసి, ఆ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తన వంతు నిధులను కూడా వెచ్చించినట్లుగా వెల్లడించిందని పేర్కొన్నారు. అయినా ప్రభుత్వ పెద్దలకు అర్థమయిందో లేదో, అర్థమై కూడా... అర్థం కానట్లు నటిస్తున్నారో తెలియడం లేదన్నారు. అయినా, ప్రభుత్వ పెద్దల పప్పులేమి ఉడకవని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు.

 బుగ్గన కామెంట్స్ వెనుక ?

బుగ్గన కామెంట్స్ వెనుక ?

అలాగే నిన్న ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రాజధానిపై చేసిన ప్రకటన వెనుక ఉన్న కారణాన్ని కూడా రఘురామ తనదైన శైలిలో వెల్లడించారు. ఆర్థిక నేరాల కేసులు, బాబాయి హత్య కేసు, రాజధాని కేసులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడంతో ప్రభుత్వ పెద్దలు సంధి ప్రేలాపనలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు.
విశాఖ ఒక్కటే రాజధాని అని అనుకున్నట్లు, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మూడు రాజధానులనే అంశం ప్రాచుర్యంలోకి వచ్చిందని బెంగళూరులో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన మనసులో మాట చెప్పారని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. పార్లమెంట్, అసెంబ్లీలో చేసిన చట్టానికి విలువ లేదన్నట్లు గా, 1937లో కుదుర్చుకున్న శ్రీబాగ్ ఒప్పందానికి మాత్రమే విలువ ఉన్నట్లుగా బుగ్గన చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు. బుగ్గన వ్యాఖ్యలతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వెలువైతే అవకాశం ఉందని గుర్తించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని చెబుతున్నారన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+