రఘురామ కేసులో కీలక పరిణామం:సునీల్ నాయక్ కు మరో రిలీఫ్..!
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు (Raghurama Krishnam Raju)ను గత వైసీపీ ప్రభుత్వంలో కస్టడీలో హింసించిన కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్, బీహార్ ఐజీ సునీల్ నాయక్ ను గుంటూరు పోలీసులు తాజాగా అరెస్టు చేసేందుకు ఆ రాష్ట్రానికి వెళ్లారు. అరెస్టు చేశాక అక్కడి స్థానిక కోర్టు ట్రాన్సిట్ వారెంట్ నిరాకరించడంతో ఏపీకి తీసుకురాలేకపోయారు. ఈ నేపథ్యంలో గుంటూరు కోర్టును ఆశ్రయించి ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకునేందుకు ప్రయత్నించారు. అక్కడే ట్విస్ట్ ఎదురైంది.
గుంటూరు కోర్టు న్యాయమూర్తి స్రవంతి ముందు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తున్నట్లు ప్రకటించినా.. ఆ తర్వాత సునీల్ నాయక్ తరఫు న్యాయవాదులు దీనికి అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే బీహార్ లోని పట్నా కోర్టు ఆయన్ను అరెస్టు చేయకుండా తాత్కాలిక ఊరటనిచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. దీంతో న్యాయమూర్తి.. పోలీసుల్ని ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదని అడిగారు. దీనికి వారు తమకు కూడా ఈ విషయం తెలియదని చెప్పినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో సునీల్ నాయక్ పై జారీ చేసేందుకు సిద్దమైన నాన్ బెయిలబుల్ వారెంట్ ను నిలిపేస్తూ గుంటూరు కోర్టు న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు పట్నాలో సునీల్ నాయక్ నివాసానికి వెళ్లి దౌర్జన్యంగా ఆయన్ను అరెస్టు చేసారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను మరోసారి అదుపులోకి తీసుకోకుండా స్థానిక కోర్టు రక్షణ కల్పించింది. సునీల్ నాయక్ ఏపీ పోలీసుల విచారణకు హాజరవుతారని అక్కడి కోర్టుకు ఆయన లాయర్లు తెలిపారు. దీంతో విచారణ వాయిదా పడింది. మొత్తం మీద సునీల్ నాయక్ కు ఏపీలోనూ తాత్కాలిక లభించినట్లయింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications