రఘురామకృష్ణంరాజు టిడిపిలో చేరిక, ఆ పార్టీకి మద్దతెందుకో చెప్పాలి: బాబు
అమరావతి: బిజెపి నేత రఘురామకృష్ణంరాజు ఆ పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం సాయంత్ర ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో టిడిపిలో చేరారు. చంద్రబాబునాయుడు నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని రఘురామకృష్ణంరాజు ప్రకటించారు.
2014 ఎన్నికల సమయంలో రఘురామకృష్ణంరాజు బిజెపిలో చేరారు.కానీ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు టిడిపిలో చేరారు. పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం పార్లమెంట్ స్థానం నుండి రఘురామకృష్ణంరాజు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం.
రఘురామకృష్ణంరాజుతో పాటు ఆయన కుమారుడు కూడ టిడిపిలో చేరారు. శుక్రవారం సాయంత్రం అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో రఘురామకృష్ణంరాజు టిడిపిలో చేరారు.

ఆ పార్టీకి మద్దతెందుకో చెప్పాలి
టిడిపి గ్రాఫ్ తగ్గిందని వైసీపీ గ్రాఫ్ పెరిగిందని బిజెపి నేతలు చెబుతున్నారని, అవినీతి పార్టీని బిజెపి నేతలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. అవినీతి పార్టీకి బిజెపి నేతలు ఎందుకు మద్దతిస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ విషయమై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం బిజెపి నేతలపై ఉందన్నారు.

అభివృద్దిని కోరుకొనేవారంతా టిడిపికి మద్దతివ్వాలి
అభివృద్దిని కోరుకొనేవారంతా టిడిపికి మద్దతివ్వాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోరారు. ఏపీ రాష్ట్రానికి బిజెపి న్యాయం చేస్తోందని భావిస్తే బిజెపి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసిందని ఆయన చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే బిజెపిపై పోరాటం చేస్తున్నామని బాబు చెప్పారు. తిరుపతి సభ ఆరంభం మాత్రమేనని ఆయన చెప్పారు.

కుట్ర రాజకీయాలపై ప్రజలకు వివరించాలి
ఏపీ రాష్ట్రంలో కుట్ర రాజకీయాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు టిడిపి కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోరారు.ఎన్నికల ముందు బిజెపి ఏ రకంగా న్యాయం చేస్తామని హమీ ఇచ్చింది, ఆ తర్వాత ఏ రకంగా ఆ హమీలను విస్మరించిందనే విషయాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు.

బాబు నమ్మకాన్ని నిలబెడతా
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నమ్మకాన్ని వమ్ము చేయబోనని బిజెపి నుండి టిడిపిలో చేరిన రఘురామకృష్ణంరాజు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకొంటామని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని ఆయన చెప్పారు.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా?












Click it and Unblock the Notifications