వైసీపీ ఎంపీలకు రఘురామ కీలక ప్రతిపాదన ! డిసెంబర్ 29న ఏం జరగబోతోంది ? ఆ మైలేజ్ ఖాయం!
ఏపీలో వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచి అనంతరం ఆ పార్టీతో విభేదించడం మొదలుపెట్టిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పటికే పలు అంశాల్లో సొంత పార్టీతో పోరాడుతున్నారు. అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైనా పార్లమెంటులో నిత్యం ప్రశ్నలు అడుగుతూ వైసీపీని అక్కడా ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పలు సందర్భాల్లో రఘురామ అడిగే ప్రశ్నలు వైసీపీ ఎంపీల్ని చికాకు పెడుతుండటంతో వారు నేరుగా ఆయన ప్రసంగాల్ని సైతం అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ తోటి వైసీపీ ఎంపీలకు రఘురామ కీలక ప్రతిపాదన చేశారు.

రఘురామ మరో పోరాటం
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో పోరాటనికి సిద్దమవుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు సందర్భాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, మరోవైపు కేంద్రానికి ఫిర్యాదులు చేస్తూ మూడేళ్లుగా చుక్కలు చూపిస్తున్న ఆయన.. ఇప్పుడు మరో పోరాటం చేసేందుకు ప్రతిపాదిస్తున్నారు.
అదీ తోటి వైసీపీ ఎంపీలతో కలిసి ఈ పోరాటం చేసేందుకు రఘురామ ప్రతిపాదిస్తున్నారు. అదీ పార్లమెంటు వేదికగానే కావడంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.

జగన్ అడుగుజాడల్లోనే
తాజాగా పార్లమెంటులో మొదలుపెట్టే ఈ పోరాటానికి రఘురామకృష్ణంరాజు స్వయంగా తన బాస్ వైఎస్ జగన్ బాటనే ఎంచుకున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పలుమార్లు ఇదే అస్త్రాన్ని వైఎస్ జగన్ ప్రయోగించారు. తద్వారా జనంలో వైసీపీ పేరు మార్మోగేలా చేయగలిగారు. తాను అనుకున్న విధంగా మైలేజ్ సాధించుకోవడమే కాకుండా రాష్ట్రం కోసం వైసీపీ పోరాడుతుందన్న భావనను జనంలో కల్పించగలిగారు. దీంతో ఇప్పుడు అదే అస్త్రాన్ని రఘురామకృష్ణంరాజు కూడా ఎంచుకుంటున్నారు.

తోటి ఎంపీలకు ప్రతిపాదన
పార్లమెంటులో వైసీపీ ఎంపీలతో పలుమార్లు వాగ్వాదాలకు, ఘర్షణలకు దిగిన రఘురామకృష్ణంరాజు ఈసారి మాత్రం వారిని కలుపుకుంటూ ఓ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. తాను అనుకున్న పోరాటంలో సొంత పార్టీ వైసీపీ కి చెందిన తోటి ఎంపీల్ని భాగస్వాముల్ని చేసేందుకు రఘురామకృష్ణంరాజు ప్రయత్నిస్తున్నారు.
అయితే వారు ఎంత వరకూ కలిసొస్తారో తెలియదు కానీ రఘురామరాజు మాత్రం వారికి బహిరంగంగానే ఆఫర్ ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు వారు దీనికి సై అంటారా లేక బాస్ ను అడిగి చెప్తారా లేక ఏదీ మాట్లాడకుండా జనంలో పలుచన అవుతారా అన్నది తేలాల్సి ఉంది.

రఘురామ ఆఫర్ ఇదే!
వైసీపీ ఎంపీలతో కలిసి పార్లమెంటులో ప్రత్యేక హోదా కోసం పలుమార్లు గతంలో గళం విప్పిన రఘరామకృష్ణంరాజు మరోసారి అదే అంశంపై తుది పోరుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 29న ముగిసే పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముగింపు రోజు ప్రత్యేక హోదాపై మూకుమ్మడి రాజీనామాలు చేయించేందుకు రఘురామ ప్రతిపాదిస్తున్నారు. ప్రత్యేక హోదాపై ఇన్నాళ్లూ పలు రూపాల్లో పోరాటాలు చేసినా ఫలితం లేనందున ఈసారి వైసీపీ ఎంపీలంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామని ప్రతిపాదిస్తున్నారు.
అయితే ఇందుకు వైసీపీ ఎంపీలు సహకరించే అవకాశాలు ఎలాగూ ఉండవు. కాబట్టి తాను మాత్రం ప్రత్యేక హోదాపై రాజీనామా సమర్పించడం ద్వారా అటు కేంద్రంతో పాటు వైసీపీ ఎంపీలు, జగన్ పై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికలకు నరసాపురంలో మరోసారి గెలిచేందుకు ఈ అస్త్రం పనికొస్తుందనేది రఘురామ ఆలోచనగా కనిపిస్తోంది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications