హోదా ఇష్టం లేదు, బిజెపికి బానిసలా మారారు: బాబుపై రఘువీరా ఫైర్

హైదరాబాద్: ఏపి ప్రత్యేక హోదాకు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు వ్యతిరేకమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. బిజెపికి ఏపి సిఎం చంద్రబాబునాయుడు బానిసలా మారారని అన్నారు.

జగ్గీవాసుదేవ్‌కు 5 ఎకరాల స్థలం సరిపోతుందని, 400 ఎకరాలు కేటాయించడం దారుణమని అన్నారు. రాజధాని పేరుతో రైతుల నుంచి వేల ఎకరాల భూములు దోచుకుంటున్నారని ఆరోపించారు. బలవంతంగా భూములు సేకరిస్తే తిరుగుబాటు తప్పదని రఘువీరా హెచ్చరించారు.

Raghuveera and Ambati fires at Chandrababu

కలెక్టర్లకు కూడా పచ్చచొక్కాలేస్తారా?: అంబటి ఫైర్

స్థానిక సంస్థల అధికారాలను హరించేలా ఉన్న జీవో నెంబర్ 44ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల గొంతునొక్కే జీవో అని ఆయన బుధవారమిక్కడ అన్నారు. చీకటి జీవోను రద్దు చేయకుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని అంబటి హెచ్చరించారు

కలెక్టర్లకు కూడా చంద్రబాబు నాయుడు పచ్చచొక్కాలు వేసే కార్యక్రమం చేస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. ఐఏఎస్ లకు చంద్రబాబు శిక్షణ ఇవ్వడం దారుణమన్నారు. చంద్రబాబుకు అత్యంత అవినీతిపరుడనే ముద్ర ఉందని ఆయన ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+