'మోడీ 5కోట్ల ఏపీ ప్రజలతో మాట్లాడాలి', చంద్రబాబుకు ధర్మాన హెచ్చరిక

అనంతపురం: ప్రధాని నరేంద్ర మోడీ ఐదు కోట్ల మంది ఆంధ్రా ప్రజలతో మాట్లాడాలని, అన్యాయాన్ని స్వయంగా తెలుసుకోవాలని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆదివారం నాడు డిమాండ్ చేశారు. బిజెపి విభజన హామీలు మరిచిందన్నారు.

ప్రధాని మోడీ ఐదు కోట్ల మంది ఆంధ్రా ప్రజలతో మాట్లాడాలన్నారు. విభజన హామీలు, సమస్యలు తెలుసుకోవాలన్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల నుంచి ప్రధాని మోడీ తెలుసుకోవాలన్నారు. ఏపీ ప్రజలకు మట్టి, నీళ్లు ఇచ్చిన మోడీ మిట్టీకా బాత్‌లో సమస్యలు తెలుసుకోవాలన్నారు.

raghuveera reddy

చంద్రబాబు ప్రభుత్వానికి ధర్మాన హెచ్చరిక

ప్రభుత్వ సంస్థలు అన్ని కూడా ఏపీలో ఒకేచోట ఏర్పాటు చేస్తే అనర్థాలు వస్తాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం ఈ విషయంలో ముందుచూపుతో వ్యవహరించాలన్నారు. లేదంటే మిగతా ప్రాంతాలు వెనుకబడతాయని చెప్పారు.

శ్రీవారి సేవలో మంత్రి నారాయణ

తిరుమల శ్రీవారిని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదివారం దర్శించుకున్నారు. విఐపి దర్శన ప్రారంభ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న నారాయణకు టిటిడి అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+