వైసీపీ రాజకీయ స్వార్థానికి ఆ ఎంపీలు బలి...వీళ్ల గెలుపు అవసరమా?: రఘువీరా
విశాఖపట్నం:వైసీపీ తన రాజకీయ స్వార్థానికి ఐదుగురు తమ పార్టీ ఎంపీలను బలి ఇచ్చిందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేల్లో సగం మంది జంప్ అయ్యారని..మిగిలినవారు అసెంబ్లీకి వెళ్లడం లేదని ఆయన ఎద్దేవాచేశారు. ఇటువంటి వారికి ఓటు వేసి ప్రజాప్రతినిధులుగా గెలిపించాల్సిన అవసరం ఉందా అని రఘువీరా ప్రశ్నించారు. మీడియా దృష్టిలో కాంగ్రెస్ అంటరాని పార్టీగా మారిందని.. తమకు కనీస ప్రాధాన్యం ఇవ్వడం లేదని రఘువీరా వాపోయారు.

గాంధీ జయంతి రోజున (అక్టోబరు 2)న ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను అందజేయాలని, ఇంటికో రూపాయి చొప్పున విరాళంగా అడిగి తీసుకోవాలని ఈ సందర్భంగా రఘువీరా పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీని ప్రజలకు దగ్గర చేసే క్రమంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. భావోద్వేగాలతో పార్టీని వదిలివెళ్లిన వారు తిరిగి వస్తామంటే చేర్చుకోవాలని సూచించారు.
Recommended Video

పదిమందితో బూత్ కమిటీలను నియమించడంతోపాటు మండల, నియోజకవర్గ కమిటీలను నియమించి ఆ వివరాలను జిల్లా కార్యాలయానికి పంపాలన్నారు. నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలు తెరవాలని రఘువీరా పార్టీ శ్రేణులను కోరారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications