రాహుల్ గాంధీతో భేటీ: ప్రత్యేక హోదాకు రఘువీరా డెడ్‌లైన్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయాలని తమ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని కోరామని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. శుక్రవారం ఢీల్లీలో ఆయన రాహుల్ గాంధీని కలిశారు.
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై ప్రధాని మోడీకి లేఖ రాస్తానని రాహుల్ చెప్పారని తెలిపారు. ప్రత్యేక హోదాపై ఈ నెల 22 లోగా ప్రత్యేక హోదాపై ప్రధాని ప్రకటన చేయాలని రఘువీరా డిమాండ్ చేశారు.

త్వరలో బీహార్‌లో ఎన్నికల ప్రచారం చేస్తామని ఆయన చెప్పారు. ఏపీ ప్రజలకు మోడీ చేసిన మోసాన్ని బీహార్ ప్రజలకు వివరిస్తామని ఆయన అన్నారు. విభజన చట్టంలోని హామీలను కూడా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాపై నిరవధిక దీక్ష చేసిన నేపథ్యంలో ఎపిలో ఆ అంశంపై దూకుడు పెంచాలని ఎపి కాంగ్రెసు నాయకత్వం భావిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇందులో భాగంగానే రఘువీరా రెడ్డి రాహుల్ గాంధీని కలిశారు.












Click it and Unblock the Notifications