పేరు పెట్టి..ఎన్టీఆర్ స్థాయిని తగ్గించారు: రఘువీరా
అనంతపురం: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడం ఆయన స్థాయిని తగ్గించడమేనని పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. కేవలం డొమెస్టిక్ టెర్మినల్‌కు మాత్రమే ఆయన పేరు పెట్టడమేంటని ప్రశ్నించారు.
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, వైశ్రాయ్ హోటల్లో ఆయనపై చెప్పులు వేయించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు ఎన్టీఆర్ పేరు గురించి అనవసర రాద్దాంతం చేస్తున్నారని రఘువీరా రెడ్డి మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని భారతీయ జనతా పార్టీ దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఎన్టీఆర్ సేవలు గుర్తుచేయక్కర్లేదు: సుజనా

హైదరాబాద్: తెలుగువారికి ఎన్టీఆర్ చేసిన సేవలను ఎవరికీ గుర్తు చేయాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి దీక్షకు సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన టిడిపి శ్రేణులనుద్దేశించి మాట్లాడారు. ఎన్టీఆర్‌కు త్వరలోనే భారతరత్న వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేపట్టిన ఒక రోజు నిరసన దీక్షకు కేంద్రమంత్రి సుజనా చౌదరి సంఘీభావం తెలిపారు.
శంషాబాద్ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్‌కు పెట్టిన ఎన్టీఆర్ పేరు మార్చాలని తెలంగాణ శాసనసభ తీర్మానం చేయడంతో అందుకు నిరసనగా మోత్కుపల్లి దీక్ష చేపట్టారు. మోత్కుపల్లి దీక్షకు సంఘీభావం తెలిపిన సుజనా చౌదరి.. అతనికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
-
Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు ముహుర్తం ఫిక్స్-కార్యకర్తలకు లేఖ-ఏ పార్టీలోకి ? -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications