కరెన్సీపై బాంబు పేల్చారు: 'చంద్రబాబుకు, బీజేపీ నేతలకు ముందే తెలుసు'
అనంతపురం: ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి శుక్రవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు విషయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ నేతలకు ముందే తెలుసునని బాంబు పేల్చారు.
బీజేపీ, టిడిపి వద్ద ఉన్న నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని ఆరోపించారు. తమ వద్ద ఉన్న నల్లధనాన్ని వైట్‌గా మార్చుకున్న అనంతరమే ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు పైన ప్రకటన చేశారన్నారు. హఠాత్తుగా నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

బ్యాంకుల్లో భారీ రద్దీ
రూ.500, రూ.1000 నోట్ల మార్పిడి కోసం రెండోరోజు ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకుల వద్ద రద్దీ కొనసాగుతోంది. రెండు రోజుల తర్వాత ఏటీఎంలు పని చేస్తాయని చెప్పినప్పటికీ చాలా ప్రాంతాల్లో పలు బ్యాంకుల ఏటీఎంలు పని చేయడం లేదు.
ఏటీఎంలలో నగదు నింపకపోవడంతో ఖాతాదారులు నిరాశకు గురవుతున్నారు. ఆంధ్రాబ్యాంకు అనుబంధంగా ఉన్న పలు ఏటీఎంలు పని చేస్తుండటంతో వాటి వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. మరోవైపు చిల్లర కోసం రిజర్వ్ బ్యాంక్ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో బారులు తీరారు.












Click it and Unblock the Notifications