చిరంజీవి ఎదుటే పవన్ కళ్యాణ్ పార్టీకి రఘువీరా చురక

Raghuveera satire on Pawan's party
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై ఎపి పిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి మంగళవారం పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పవన్ సోదరుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘువీరా పవన్ పార్టీకి చురకలు అంటించారు.

అన్ని పార్టీలు ఏకమైనా కాంగ్రెసు పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదని జనసేనను ఉద్దేశించి అన్నారు. సీమాంధ్ర, కాంగ్రెసు పార్టీ పునర్ నిర్మాణమే తమ లక్ష్యమన్నారు. 1978లో వచ్చినట్లు కాంగ్రెసు పార్టీలో ఇప్పుడు యువతరానికి అవకాశం వస్తుందని రఘువీరా రెడ్డి చెప్పారు. యుద్ధ భూమిలో అడుగు పెట్టాక సీనియర్ నేతలు పారిపోతున్నారని మండిపడ్డారు.

కెసిఆర్‌పై దానం

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు చూసి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు దిమ్మ తిరుగుతుందని మాజీ మంత్రి దానం నాగేందర్ వేరుగా అన్నారు. తెలంగాణలో దొరల రాజ్యం తెచ్చేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని, ఆయన ప్రయత్నాన్ని తాము అడ్డుకుంటామన్నారు. ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని ఆయన గవర్నర్ కు వినతి పత్రం సమర్పించారు.

బిజెపిలోకి రఘునందన్ రావు

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధికార ప్రతినిధి రఘునందన రావు తన పదవికి రాజీనామా చేశారు. ఆయన త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+