ఢిల్లీకి రండి, మీ అనుభవంతో..: బాబుకు రఘువీరా 'ప్రత్యేక' ప్రతిపాదన

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: తమ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు ప్రత్యేక హోదా పైన పెట్టిన ప్రయివేటు మెంబర్ బిల్లుకు మీరు మద్దతు పలకాలని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి బుధవారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు.

ప్రత్యేక హోదా సాధించడం కోసం కేవీపీ రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రయివేటు మెంబర్ బిల్లు ఈ నెల 22న చర్చకు రానుంది. ఈ నేపథ్యంలో బిల్లుకి మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read: ఆత్మరక్షణలో చంద్రబాబు!, కేవీపీ బిల్లుకు మద్దతు: ఏమైనా జరగొచ్చు

Raghuveera writes letter to AP CM Chandrababu

ఇందులో భాగంగా రఘువీరా సీఎంకు లేఖ రాశారు. చంద్ర‌బాబుని ఢిల్లీ రావాల్సిందిగా ఆయ‌న కోరారు. మీ అనుభ‌వంతో ప‌లు రాజ‌కీయ పార్టీల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టాలని కూడా లేఖ‌లో పేర్కొన్నారు. రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌త్యేక హోదా అంశం గురించి ముందుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

Also Read: 'చంద్రబాబును ఆ మాట అనడం జగన్ తప్పిదం, ప్రతి ఏడాది వస్తాయా'

ఇప్పటికే కేవీపీ బిల్లుకు టిడిపి మద్దతు పలుకుతున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో బాబు ముందు రఘువీరా మరో అంశం ఉంచారు. దేశ రాజధానికి వచ్చి, ఇతర పార్టీల మద్దతు కూడగట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP Congress chief Raghuveera Reddy writes letter to AP CM Chandrababu Naidu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి