ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముగిసిన రాహుల్ పాదయాత్ర: ఐదు కుటుంబాలకు ఓదార్పు

By Pratap
|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్: కాంగ్రెసు యువరాజు రాహుల్ గాంధీ రైతు భరోసా యాత్ర శుక్రవారం ఉదయం ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైంది. కొరిటికల్‌లో రాజీవ్ గాంధీ ఆత్మహత్య చేసుకున్న రైతు వెల్మ రాజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన భార్యను, పిల్లలను పరామర్శించారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెసు తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ కూడా ఈ యాత్రకు వచ్చారు. గురువారం రాత్రి రాహల్ గాంధీ ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం చేపట్టిన రాహుల్ గాంధీ పాదయాత్ర మధ్యాహ్నానికి ముగిసింది. తన పాదయాత్రలో ఆయన ఆత్మహత్య చేసుకున్న ఐదుగురు రైతుల కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రెండేసి లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఆయన వడ్యాల్‌లో సభా స్థలికి చేరుకున్నారు. ఇక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.

రాహుల్ గాంధీ రాచపూర్ చేరుకున్నారు. ఇక్కడ ఆయన గంగాధర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

రాహుల్ గాంధీ పొట్పల్లిలో డ్వాక్రా మహిళలతో, ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. మాజీ మంత్రి గీతారెడ్డి, శాసనసభ్యురాలు పద్మావతి అనువాదకులుగా వ్యవహరిస్తున్నారు. కార్యకర్తలతో కరచాలనం చేస్తూ ఆయన పాదయాత్ర సాగిస్తున్నారు. రైతు సమస్యలే కాకుండా రాష్ట్ర పరిస్థితులపై కూడా ఆయన ఆరా తీస్తున్నారు. కాంగ్రెసు నాయకులతో ఆయన మాటామంతీ సాగిస్తూ ముందుకు సాగుతున్నారు.

ఈ రోజు కార్టూన్

రాహుల్ గాంధీ లక్ష్మణ్‌చందా చేరుకున్నారు. ఈ గ్రామంలో ఆయన రెండు రైతు కుటుంబాలను పరామర్శించారు. బోండ్ల లింగయ్య, సూది లక్ష్మయ్య కుటుంబాలను ఆయన పరామర్శించి భరోసా ఇచ్చారు. లింగయ్య కూతురు చదువుపై రాహుల్ గాంధీ ఆరా తీశారు. లింగయ్య కుటుంబం ఆర్థిక పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు.

రాహుల్ గాంధీ పర్యటనతో ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, కొరిటికల్ ప్రాంతాలు కాంగ్రెసు కార్యకర్తలతో నిండిపోయాయి. రాజేశ్వర్ కుటుంబానికి రాహుల్ గాంధీ లక్ష రూపాయల ఆర్థి సాయాన్ని అందించారు. రాహుల్ గాంధీ వెంట తెలంగాణ కాంగ్రెసు నాయకులు కూడా ఉన్నారు.

Rahul Gandhi Bharosa Yatra in Telangana

కొరిటికల్ నుంచి రాహుల్ గాంధీ తన పాదయాత్రను ప్రారంభించారు. వడ్యాల వరకు 15 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేస్తారు. తిరుపెల్లి, లక్ష్మణ్ చందా, పొట్టపల్లి, రాచవూర్ మీదుగా ఆయన పాదయాత్ర సాగుతుంది. లక్ష్మణ చందాలో ఆయన బోండ్ల లింగనన్న, అస్మన్న కటుంబాలను పరామర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు వడ్యాలలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించడానికి రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపట్టారు.తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు రైతులను పట్టించుకునే తీరిక లేదని కాంగ్రెసు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. రైతుల గురించిన ఆలోచనే కెసిఆర్‌కు లోదని ఆయన అన్నారు. రాహుల్ గాంధీతో పాటు పాదయాత్రలో పాల్గొంటున్న ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు భరోసా ఇవ్వడానికే రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలకు మాత్రమే పరిమితమయ్యారని ఆయన అన్నారు. తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన చెప్పారు.

రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ నాయకులు పాదయాత్రలో పాల్గొన్నారు. రాహుల్ వెంట అసోం ముఖ్యమంత్రి కుమారుడు గౌరవ్, పార్లమెంటు సభ్యులు సుస్మిత, రాజ్ బబ్బర్ ఉన్నారు.

English summary
Congress vice president Rahul Gandhi has begun his padayatra from Koratikal in Adilabad district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X