జగన్ రికార్డును బ్రేక్ చేసిన రాహుల్ - ఇక షర్మిల వంతు..!?

జగన్ పాదయాత్ర రికార్డును రాహుల్ గాంధీ బ్రేక్ చేసారు. ఇప్పుడు షర్మిల కూడా అదే బాటలో ఉన్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ భారత్ జోడో యాత్ర పూర్తయింది. కన్యాకుమారి నుంచి ప్రారంభించి శ్రీనగర్ లో యాత్ర ముగించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనూ పాదయాత్రల సీజన్ కొనసాగుతోంది. ఇక.. రాహుల్ పాదయాత్ర ముగిసిన వేళ..నాడు జగన్ తన పాదయాత్ర ద్వారా నెలకొల్పిన రికార్డులతో పోల్చి చూస్తున్నారు. ప్రస్తుతం విరామం ఇచ్చిన అటు వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్ర ఫిబ్రవరి 2వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఏపీలో నారా లోకేష్ యాత్ర ప్రారంభమైంది. దీంతో.. అసలు అందరి గురి ఇప్పుడు జగన్ రికార్డులపైనే ఉన్నాయి.

పూర్తయిన రాహుల్ యాత్ర

పూర్తయిన రాహుల్ యాత్ర


రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఈ రోజు శ్రీనగర్ లో ముగిసింది. రాహుల్ యాత్ర మొత్తం 12 రాష్ట్రాల్లో కొనసాగింది. 134 రోజుల పాటు 4,084 కిలో మీటల మేర రాహల్ యాత్ర కొనసాగింది. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్ యాత్ర ఈరోజు శ్రీనగర్ లోని స్టేడియంలో సభతో పూర్తయింది. పాదయాత్రల్లో వైఎస్ ఫ్యామిలీది ప్రత్యేక ట్రెండ్. రికార్డులు వారి పేరునే ఉన్నాయి. జగన్ నాడు ఏపీ ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ పాదయాత్ర చేసారు. జగన్ 341 రోజుల పాటు 3,648 కిలో మీటర్ల మేర యాత్ర నిర్వహించారు. తన యాత్రలో భాగంగా దాదాపు రెండు కోట్ల మంది ప్రజలతో మమేకం అయ్యారు. రాహుల్ గాంధీ ఇప్పుడు ఏడు రాష్ట్రాల్లో యాత్ర ద్వారా 4,084 కిలో మీటర్లను 134 రోజుల వ్యవధిలో పూర్తి చేసారు. నాడు జగన్ ఏపీలోని పదమూడు జిల్లాల్లోనూ పాదయాత్ర నిర్వహించారు. తాను అధికారంలోకి వస్తే ఏం చేయగలనో చెప్పి ప్రజలను ఒప్పించారు. ఫలితంగా అధికారం దక్కించుకున్నారు.

షర్మిల యాత్ర.. మలి విడత కొనసాగింపు

షర్మిల యాత్ర.. మలి విడత కొనసాగింపు


ఇక, ఇప్పుడు తెలంగాణలో వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. తెలంగాణలో రాజ్యన్న రాజ్యం లక్ష్యంతో పాదయాత్ర చేస్తున్న షర్మిలకు దాదాపు మూడు నెలల కాలంగా విరామం లభించింది. తెలంగాణ అదికార పార్టీ నేతల పైన వ్యాఖ్యలు..వివాదంతో పాదయాత్రకు అనుమతి దక్కలేదు. కోర్టుకెళ్లిన షర్మిల పాదయాత్రకు అనుమతి సంపాదించారు. తిరిగి ఫిబ్రవరి 2వ తేదీ నుంచి షర్మిల యాత్ర కొనసాగనుంది. ఇప్పటికే తెలంగాణలో షర్మిల యాత్రం దాదాపుగా 3,500 కిలో మీటర్ల మేర పూర్తి చేసారు. తన అన్న జగన్ పాదయాత్ర రికార్డుకు ఇంకా 150 కిలో మీటర్ల దూరంలో ఉన్నారు. తిరిగి పాదయాత్ర ప్రారంభించిన తరువాత 15 రోజుల్లోగానే ఈ రికార్డుకు చేరుకొనే అవకాశం కనిపిస్తోంది.

జగన్ రికార్డులపై లోకేష్ గురి

జగన్ రికార్డులపై లోకేష్ గురి


తాజాగా...టీడీపీ నేత నారా లోకేశ్ కుప్పం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పటి వరకు కుప్పం నియోజకవర్గంలో యాత్ర పూర్తయి పలమనేరులో ప్రవేశించింది. లోకేష్ పాదయాత్ర మొత్తంగా నాలుగు వందల రోజుల పాటు నాలుగు వేల కిలో మీటర్లు 125 నియోజకవర్గాల్లో కొనసాగేలా ప్రణాళికలు సిద్దం చేసారు. దాదాపుగా వచ్చే ఏడాది ఎన్నికల షెడ్యూల్ వరకు లోకేష్ యాత్ర కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశం ఉంటే పాదయాత్ర పైన ఆ నిర్ణయం ప్రభావం ఉండనుంది. లోకేష్ కూడా నాలుగు వేల కిలో మీటర్ల యాత్ర పూర్తి చేసి జగన్ రికార్డులను అధిగమించాలనే లక్ష్యంతో ఉన్నారు. మరి సాధ్యం అవుతుందా లేదా అనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+