తమ్ముడు వరుణ్ గాంధీపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు-అతన్ని కలుస్తా కానీ.. అంగీకరించలేను..

భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ సోదరుడు, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీపై స్పందించారు. వరుణ్ పై అరుదుగా మాట్లాడే రాహుల్.. ఇవాళ పంజాబ్ లో జరుగుతున్న భారత్ జోడో యాత్ర విరామంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఓ ప్రశ్నకు స్పందించారు.

తన సోదరుడు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీతో సంబంధాలపై రాహుల్ గాంధీ ఇవాళ స్పందించారు. తమకు రెండు భిన్నమైన సిద్ధాంతాలు ఉన్నాయని, తమ్ముడు స్వీకరించిన సిద్ధాంతాన్ని తాను అంగీకరించలేనని అన్నారు. తాను కావాలంటే వరుణ్ ను కలవగలను, కౌగిలించుకోగలను, కానీ నేను ఆ భావజాలాన్ని అంగీకరించలేన అని రాహుల్ తేల్చిచెప్పేశారు.

Rahul Gandhi interesting comment on cousin Varun Gandhis idealogy

వరుణ్ గాంధీ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారని, ఆయన భారత్ జోడో యాత్రలో నడిస్తే అది అతనికి సమస్య కావచ్చని రాహుల్ గాంధీ వెల్లడించారు. తన భావజాలం ఆయన భావజాలంతో సరిపోలడం లేదన్నారు. తాను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్ ) కార్యాలయానికి ఎప్పటికీ వెళ్ళలేనని రాహల్ తెలిపారు. అలా వెళ్లాల్సి వస్తే తన నరుక్కోవాల్సి వస్తుందన్నారు. తన కుటుంబానికి ఓ సిద్దాంతం ఉందని, ఏదో ఒక సమయంలో, ఇప్పుడు కూడా వరుణ్ దానికి భిన్నమైన దానికి స్వీకరించాడని, తాను ఆ భావజాలాన్ని అంగీకరించలేనని రాహల్ వెల్లడించారు.

దేశంలోని సంస్థలపై ఆర్‌ఎస్‌ఎస్‌, భాజపా తీసుకొస్తున్న ఒత్తిడిపైనా రాహుల్‌ గాంధీ ఇవాళ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ దేశంలోని అన్ని సంస్థలను ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ నియంత్రిస్తున్నాయని, అన్ని సంస్థలపైనా ఒత్తిడి ఉందని ఆయన తెలిపారు. మీడియా ఒత్తిడిలో ఉందని, బ్యూరోక్రసీ ఒత్తిడిలో ఉందని, ఎన్నికల సంఘం కూడా ఒత్తిడిలో ఉందని, చివరికి వారు న్యాయవ్యవస్థపైనా ఒత్తిడి తెచ్చారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+