పాకిస్తాన్ కు ఉప్పందించారా ? లేదా ? జైశంకర్ మౌనంపై రాహుల్ ప్రశ్నలు..!
కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ముందుగా పాకిస్తాన్ తో పాటు ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర శిబిరాలకే పరిమితమైంది. దీని తర్వాత భారత్ పరిమిత దాడి మాత్రమే చేసిందని, సైనిక స్థావరాల్ని టచ్ చేయలేదంటూ కేంద్రం ఆ దేశానికి ఇచ్చిన సమాచారం, ఆ తర్వాత చేసిన దాడుల్లో మనకు తీవ్ర నష్టం కలిగించిందంటూ రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. దీనిపై కేంద్రం సమాధానం చెప్పకుండా మౌనం వహించడంతో ఇవాళ ఆయన మరోసారి ప్రశ్నించారు.
తాను అడిగిన ప్రశ్నపై విదేశాంగమంత్రి జైశంకర్ మౌనం దేశానికి నష్టం కలిగిస్తోందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ ఎక్స్ లో పోస్టు చేశారు. కాబట్టి తాను ఆయన్ను మరోసారి అడుగుతున్నట్లు తెలిపారు. పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ పై ముందస్తు సమాచారం ఇవ్వడం వల్ల భారత్ ఎన్ని యుద్ధ విమానాలు నష్టపోయిందో చెప్పాలని రాహల్ గాంధీ జైశంకర్ ను కోరారు. ఇది తప్పిదం కాదని, నేరమని రాహుల్ తెలిపారు. కాబట్టి దేశం వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటోందన్నారు. ఈ ట్వీట్ కు గతంలో జైశంకర్ మాట్లాడిన వ్యాఖ్యల వీడియోతో కూడిన ట్వీట్ ను రాహుల్ రీట్వీట్ చేశారు.

మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా కూడా రాహుల్ గాంధీ ఆరోపణలను ప్రస్తావించారు. విదేశాంగ మంత్రికి, పాకిస్తాన్ కు మధ్య ఉన్న సంబంధం ఏంటన్నారు. అందుకే ఆయన వారికి ముందుగానే చెప్పారన్నారు. ఇది దౌత్యం కాదని, ఇది గూఢచర్యం అన్నారు. విదేశాంగ మంత్రి చెప్పినది అందరూ విన్నారని, దాన్ని కప్పిపుచ్చే కుట్ర జరుగుతోందన్నారు. ఈ సమాచారం ఉగ్రవాదులు మసూద్ అజార్, హఫీజ్ సయీద్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన వైమానిక దాడుల నుండి తప్పించుకోవడానికి సహాయపడిందా అని పవన్ ఖేరా ప్రశ్నించారు. దీనిపై ప్రధాని కూడా సమాధానం చెప్పాలన్నారు.
EAM Jaishankar’s silence isn’t just telling — it’s damning.
— Rahul Gandhi (@RahulGandhi) May 19, 2025
So I’ll ask again: How many Indian aircraft did we lose because Pakistan knew?
This wasn’t a lapse. It was a crime. And the nation deserves the truth. https://t.co/izn4LmBGJZ
కాంగ్రెస్ నేతల ప్రశ్నలు, విమర్శలపై విదేశాంగశాఖ స్పందించింది. ప్రారంభంలోనే పాకిస్తాన్‌ను తాము హెచ్చరించామని విదేశాంగమంత్రి పేర్కొన్నారని తెలిపింది. ఇది స్పష్టంగా ఆపరేషన్ సిందూర్ ప్రారంభం తర్వాత ప్రారంభ దశ అన్నారు. అయితే ఇది ఆపరేషన్ ప్రారంభానికి ముందే జరిగినట్లు తప్పుగా ప్రచారం జరుగుతోందని తెలిపింది. వాస్తవాలను పూర్తిగా తప్పుగా చూపించడాన్ని ఇలా చేస్తున్నారని విమర్శించింది.












Click it and Unblock the Notifications