దీక్ష: చంద్రబాబుపై విమర్శలు, రాహుల్ పర్యటనపై రూట్ మ్యాప్ (ఫోటోలు)
హైదరాబాద్: జూన్ 29 లేదా 30వ తేదీన ఏపీలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన ఉంటుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన ఏపీ కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం ముగిసింది.
ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ నేత పళ్లం రాజు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో రాహుల్ రైతు భరోసా యాత్ర చేపడతారని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని తెలిపారు.
చంద్రబాబు ఏడాది పాలనలో అవినీతిపై ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఏపీ సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇందిరా పార్కు వద్ద చేపట్టిన దీక్షలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘవీరా రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు పళ్లం రాజు, కిల్లి కృపారాణి, జేడీ శీలం, మాజీ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబుపై విమర్శలు, రాహుల్ పర్యటనపై రూట్ మ్యాప్

చంద్రబాబు ఏడాది పాలనలో వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. బ్రీఫ్ కేసు, సూట్ కేసు పాలన సాగిందని, బిగ్ బాస్ కు, స్మాల్ బాబు లోకేశ్ లకే ఈ వేల కోట్లు ముట్టాయని ఆయన ధ్వజమెత్తారు.

చంద్రబాబుపై విమర్శలు, రాహుల్ పర్యటనపై రూట్ మ్యాప్
ఏపీ సీఎం చంద్రబాబు మొదటి నుంచీ అవినీతి పరుడేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఆరోపించారు. కాకపోతే తాజాగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కేసులో బయటపడ్డాడని ఆయన అన్నారు. వదిలేయండని ప్రధాని మోడీకి కేసీఆర్ చెబితే తప్ప ఓటుకు నోటు కేసు నుంచి చంద్రబాబు నాయుడు బయటపడలేరన్నారు.

చంద్రబాబుపై విమర్శలు, రాహుల్ పర్యటనపై రూట్ మ్యాప్
రాహుల్ గాంధీ పర్యటనను దృష్టిలో పెట్టుకుని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘవీరా రెడ్డి రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. ముందుగా అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓబుల దేవర చెర్వు మండల కేంద్రం నుంచి నల్లమడ మండల కేంద్రం వరకూ దాదాపు 15 కిలో మీటర్ల పొడవున రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబుపై విమర్శలు, రాహుల్ పర్యటనపై రూట్ మ్యాప్
ఈ పాదయాత్రలో భాగంగా ఉపాధి కోసం వలస వెళ్లిన కుటుంబాలను, డ్వాక్రా మహిళా సంఘాలతోనూ రాహుల్ భేటీ అవుతారు. వీరితో పాటు మార్గం మధ్యలో స్వచ్ఛంద సేవా సంస్థలు, పౌర హక్కుల నేతులు, సామాజిక సేవా కార్యకర్తలతో కూడా భేటీ అయ్యేలా ఏర్పాట్లు చేశారు.

Click it and Unblock the Notifications