ఏపీలో ఆ స్టేషన్లోనూ వందేభారత్ హాల్టింగ్.. శుభవార్త చెప్పిన రైల్వే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతిలో రైల్వే పోషిస్తున్న పాత్ర అంతా ఇంతా కాదు. ఏపీలో వందే భారత్ రైళ్లతో, కొత్త రైల్వే లైన్లతో ఏపీ రైల్వే వ్యవస్థను పరిపుష్ఠం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా హై ఫై వసతులతో వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది భారతీయ రైల్వే. ఇక తాజాగా ఏపీ వాసులకు వందే భారత్ విషయంలో మరో శుభవార్త చెప్పింది.
వారికి రైల్వే శుభవార్త
వందే భారత్ ట్రైన్స్ ను అత్యంత వేగంగా గమ్య స్థానాలకు చేర్చటం కోసం అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా రైల్వే ప్రయాణికులకు రైల్వే ఓ గుడ్ న్యూస్ చెప్పింది. వందే భారత్ ట్రైన్ హాల్టింగ్ విషయంలో ఒక శుభవార్త చెప్పింది. ఇప్పటికే విశాఖ వందే భారత్ కు సామర్ల కోటలో హాల్టింగ్ ఇచ్చింది. ఇక తాజాగా మరో స్టేషన్ లో హాల్టింగ్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది రైల్వే.

అక్కడ వందేభారత్ హాల్టింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సికింద్రాబాద్- విశాఖపట్నం- సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ లో ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సహజంగా వందే భారత్ రైలు చాలా తక్కువ స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది . అయితే వందే భారత్ రైలును సామర్లకోటలో ఆపుతున్నారు. ఇక తాజాగా ఏలూరులోనూ వందే భారత్ రైలును ఆపాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈనెల 25వ తేదీ నుంచి 6 నెలల పాటు అక్కడ హాల్టింగ్
ఏలూరు లో వందే భారత్ హాల్టింగ్ కోసం డిమాండ్ ఉన్న నేపధ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఏలూరు స్టేషన్లో సికింద్రాబాద్ విశాఖ పట్నం సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఒక నిమిషం పాటు ఆగుతుంది. ఈనెల 25వ తేదీ నుంచి 6 నెలల పాటు ఈ రైలు ఏలూరు స్టేషన్లో హాల్టింగ్ ఇవ్వనున్నారు.
ఏలూరు వాసుల హర్షం
ఆగస్టు నెల వరకు వందే భారత్ రైలును ఇక్కడ ఆపుతారు. ఇక ఆ తర్వాత దానిని పొడిగిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఆరు నెలల కాలం అక్కడ ప్రజలు వందే భారత్ వినియోగం ఎలా ఉందో గమనిస్తారు. ప్రయాణికుల నుండి ఎక్కువ డిమాండ్ ఉంటే హాల్టింగ్ కొనసాగించే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా వందే భారత రైలు ఏలూరులో ఆపేలా నిర్ణయం తీసుకోవడం పైన ఏలూరు ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications