సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ : షెడ్యూల్ - రూట్ మ్యాప్..!!

Vande Bharat: సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందేభారత్ షెడ్యూల్ ను అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 8న ప్రధాని మోదీ సికింద్రాబాద్ లో ఈ రైలును లాంఛనంగా ప్రారంభిస్తారు. తొలి రోజు సాధారణ ప్రయాణీకులకు అవకాశం ఉండదు. 9న తిరుపతి నుంచి సర్వీసు ప్రారంభం కానుంది. 10వ తేదీన ఉదయం సికింద్రాబాద్ లో బయల్దేరటం ద్వారా ఈ రైలు అధికారికంగా రాకపోకలు ప్రారంభం అవుతాయి. వారంలో ఒక్క రోజు మినహా ఈ రైలు అందుబాటులో ఉండనుంది. 8.30 గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి తిరుపతి వందేభారత్ చేరుకోనుంది,

సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ పట్టాలెక్కనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇది రెండో వందేభారత్ కానుంది. వారంలో మంగళవారం మినహా ప్రతీ రోజు ఈ రైలు రాకపోకలు ఉంటాయి. సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైలు నెంబర్ 20701గా నిర్ణయించారు.

Railway officials announce Secunderabad - Tirupati Vande Bharat Schedule and Routemap

ఈ రైలు ప్రతీ రోజు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ లో బయల్దేరి నల్గొండ కు 07.19కి, గుంటూరుకు 9.45, ఒంగోలుకు 11.09, నెల్లూరుకు 12.29 చేరుకొని..అక్కడ నుంచి మధ్నాహ్నం తిరుపతికి 14.30 చేరుకుంటుంది. సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ వందేభారత్‌ రైలులో ఎగ్జిక్యూటివ్ చైర్ కారు ధర రూ. 2వేలు పైగా ఉండే అవకాశం ఉంది. ఏసీ చైర్ కారు రూ. 1150గా ఉంటుందని సమాచారం.

తిరుగు ప్రయాణంలో భాగంగా.. తిరుపతి టు సికింద్రాబాద్ వందేభారత్ సర్వీసు నెంబర్ 20702 గా నిర్ణయించారు. ఈ రైలు తిరుపతిలో మధ్నాహ్నం 15.15కి బయల్దేరి..నెల్లూరుకు సాయంత్రం 17.20, ఒంగోలు 18.30, గుంటూరు 19.45, నల్గొండకు 22.10, సికింద్రాబాద్ కు రాత్రి 23.45కి చేరుకుంటుంది.

సికింద్రాబాద్ - తిరుపతి మధ్య కేవలం నాలుగు స్టేషన్లకు మాత్రమే హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. ఈ రోజుల టికెట్ ధరలతో పాటుగా రైలు నెంబర్లను అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఇక.. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందేభారత్ రైళ్లు సికింద్రాబాద్ - పూణే, కాచిగూడ - బెంగళూరు మధ్య త్వరలోనే ప్రారంభించనున్నట్లు సమాచారం. లక్షలాది మంది భక్తులు నిత్యం తరలి వచ్చే తిరుమలకు ఇప్పుడు వందేభారత్ ద్వారా మరింత వెసులుబాటు కలగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+