వందేభారత్ స్లీపర్ రైలు వచ్చేస్తోంది - తొలిగా ఈ మార్గంలో..!!

ప్రస్తుతం వందేభారత్ ట్రెండ్ కొనసాగుతోంది. పలు ప్రధాన మార్గాల్లో వందేభారత్ ను క్రమేణా విస్తరిస్తున్నారు. వేగం..సౌకర్యవంతం..సమయం తక్కువ కావటంతో ధరలు ఎక్కువగా ఉన్నా ప్రయాణీకుల ఆదరణ పెరుగుతోంది. ఇదే సమయంలో దూరం మార్గాల్లోనూ వందేభారత్ ను స్లీపర్ కోచ్ లతో ప్రవేశ పెట్టేందుకు రంగం సిద్దమైంది. ఇందు కోసం తొలి రైలు ప్రారంభం పైన కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే రూట్ కూడా ఖరారు చేసారు.

వందేభారత్ స్లీపర్: మేకిన్ ఇండియా రైలుగా వందేభారత్ కు కేంద్రం ప్రాధాన్యత ఇస్తోంది. అన్ని రైళ్లను ప్రధాని ప్రారంభిస్తుండటం ద్వారా ఏ మేర ప్రాధాన్యత ఇస్తున్నారో అర్దం అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రధాని స్వయంగా రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. ఈ ఏదాది చివరల్లోగా సాధ్యమైన సంఖ్యలో వందేభారత్ రైళ్లను ప్రారంభించాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించింది.

Railways to launch first sleeper Vande Bharat between Delhi - Mumbai soon

అందులో తెలుగు రాష్ట్రాలకు మరో రెండు కేటాయిస్తూ ఇప్పటికే సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటి వరకు వందే భారత్‌లో రైళ్లలో కేవలం చైర్‌కార్‌ సీట్లు మాత్రమే ఉన్నాయి. త్వరలోనే స్లీపర్‌ క్లాస్‌ రైలును పట్టాలెక్కించనున్నది. వందేభారత్ స్లీపర్ రైళ్ల ప్రారంభం పైన కసరత్తు ప్రారంభమైంది.

దశల వారీ విస్తరణ: తొలి వందే భారత్ స్లీపర్‌ రైలు ముంబయి - ఢిల్లీ మార్గంలో ప్రారంభించాలని నిర్ణయించారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైలు సిద్దం అవుతోంది. ముంబయి - ఢిల్లీ మధ్య ప్రయాణ సమయం దాదాపు 16 గంటలు. దీన్ని 12 గంటలకు తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కవచ్‌ వ్యవస్థ, ట్రాక్‌ల ఫెన్సింగ్‌ పనులు జరుగుతున్నాయి.

మిషన్‌ రాఫ్తార్‌లో భాగంగా ఈ మార్గంలో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణించేలా తయారు చేస్తున్నారు. 86 వందే భారత్ రైళ్లను తయారు చేసేందుకు ఐసీఎఫ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇందులో స్లీపర్ వెర్షన్ ఉండదని, వీలైనంత త్వరగా వాటి ప్రోటోటైప్‌ను సిద్ధం చేస్తామన్నారు. వచ్చే నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 400 వందేభారత్ రైళ్లను నడపాలని లక్ష్యంగా నిర్ణయించారు.

Railways to launch first sleeper Vande Bharat between Delhi - Mumbai soon

తెలుగు రాష్ట్రాలకు ఛాన్స్: ప్రస్తుతం నడుస్తున్న వందేభారత్ తో పాటుగా వందేమెట్రో పైన కసరత్తు కొనసాగుతోంది. ప్రధానంగా నిత్యం రద్దీగా ఉండే ప్రధాన నగరాల నుంచి సమీప పట్టణాలకు వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. క్రమేణా సూపర్ ఫాస్ట్ రైళ్ల మార్గంలో వందేభారత్ కు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి.

సాధారణ ప్రయాణీకులకు అనుగుణంగానూ వందేభారత్ తో కేటగిరీలను అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వచ్చేది ఎన్నికల కాలం కావటంతో డిమాండ్ ఉన్న మార్గాల్లో వందేభారత్ ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. దీంతో, అన్ని రాష్ట్రాల్లోనూ విస్తరించటం కేంద్రం లక్ష్యంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+