కుంభమేళాకు వందేభారత్ స్పెషల్ - షెడ్యూల్..!!
Maha Kumbhmela: మహాకుంభ మేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. పెద్ద సంఖ్యలో విదేశీ భక్తులు సైతం తరలి వస్తున్నారు. తొలుత 40 కోట్ల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేసినా.. ఇప్పటికే 50 కోట్ల మంది పుణ్య స్నానాలు చేసినట్లు చెబుతున్నారు. ఈ నెల 26వ తేదీ వరకు కుంభమేలా కొనసాగనుంది. ఇదే సమయంలో పెరుగుతున్న భక్తుల రద్దీతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కుంభమేళాకు వెళ్లే వారి కోసం వందేభారత్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాగ్ రాజ్ వరకు వందేభారత్ నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.
భారీ రద్దీ
మహాకుంభమేళా అతి పెద్ద సంగమంగా ప్రపంచంలో నిలిచి పోనుంది. అంచాలనను మించి భారీ సంఖ్య లో భక్తులు కుంభమేళాకు తరలి వస్తున్నారు. ఊహించని విధంగా భక్తుల సంఖ్య పెరుగుతోంది. విదేశాల నుంచి సైతం పలువురు పుణ్య స్నానాల కోసం ప్రయాగ్ రాజ్ కు తరలి వస్తున్నారు. త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు చేస్తున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా దాదాపు 13 వేల ప్రత్యేక రైళ్లు ప్రయాగ్ రాజ్ కు నడుపుతున్నారు. డిమాండ్ పెరగటంతో విమాన సంస్థలు టికెట్ ధరలు భారీగా పెంచాయి. పలు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు ప్రత్యేక ప్యాకేజీలతో బస్సులను ఏర్పాటు చేస్తున్నాయి.

వందేభారత్
కాగా, తాగాజా రైల్వే శాఖ ప్రయాగ్ రాజ్ వరకు కుంభమేళాకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా వందేభారత్ ఏర్పాటు చేసింది. ఢిల్లీ నుంచి వారణాసికి వయా ప్రయాగ్ రాజ్ రైల్వే శాఖ వందేభారత్ సర్వీసును ఏర్పాటు చేసింది. ఈ రోజు (15వ తేదీ) నుంచి 17వ తేదీ వరకు ప్రత్యేక వందేభారత్ ప్రయాగ్ రాజ్ మీదుగా నడవనుంది. ఈ ప్రత్యేక వందేభారత్ రైలు (రైలు నెం. 02252) న్యూఢిల్లీ నుంచి వారణాసి మధ్య నడుస్తుంది. ఈ ట్రైన్ న్యూఢిల్లీ నుంచి ఉదయం 05:30 గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం 14:20 గంటలకు వారణాసి చేరుకుంటుం ది. ప్రయాగ్ రాజ్ మీదుగా ఈ రైలు నడపనున్నారు.
మహా శివరాత్రితో పూర్తి
భక్తుల నుంచి వస్తున్న డిమాండ్ కు అనుగుణంగా ఈ ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఈ మేరకు రిజర్వేషన్లు అందు బాటులోకి వచ్చాయి. కుంభమేళాకు వస్తున్న వారితో వారణాసిలోనూ రద్దీ పెరిగింది. పుణ్యస్నానాలకు మరో ముహూర్తం మహాశివరాత్రి మాత్రమే మిగిలి ఉంది. ఆ రోజు స్నానాలతో కుంభమేళా ముగియనుంది.












Click it and Unblock the Notifications