గూడు మునిగింది, పట్టా నుండి రైలు జారింది!(పిక్చర్స్)
హైదరాబాద్: రుతు పవనాలు, అల్పపీడనాల వల్ల రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. ఐదు రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం సాయంత్రానికి వాయువ్య దిశగా కదులుతూ రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలను ఆనుకొని స్థిరంగా కొనసాగింది.
గత రెండు రోజులుగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. అల్పపీడన ప్రభావం రాయలసీమ, తెలంగాణ జిల్లాలపై శుక్రవారం బలంగా ఉండవచ్చునని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు పదమూడు మంది మృతి చెందారు. మరో ఇరవై నాలుగు గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. కోస్తాలో కుంభవృష్టితో జన జీవనం అతలాకుతలమైంది. రాయలసీమ, తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీగా కురుస్తున్నాయి.

వర్షం 1
తూర్పు గోదావరి జిల్లా రాజోలు ప్రాంతంలో వశిష్ట గోదావరి నది ఎడమ ఏటిగట్టు 200 మీటర్లు కుంగిపోయింది. గండిపడితే రాజోలు దీవికి తీవ్ర ముప్పు తప్పదు.

వర్షం 2
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం బ్రాంచ్ కెనాల్‌కు అనుబంధంగా ఉండే పాటికాల్వకు గండిపడటంతో పంటపొలాలు నీటమునిగాయి. జిల్లాలోని సుబ్బారెడ్డిసాగర్, పంప, ఏలేరు జలాశయాలకు భారీగా నీరు వచ్చి చేరింది.

వర్షం 3
తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో గురువారం కుండపోత వర్షం కురిసింది. కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆత్మకూరు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తూ ప్రజాజీవనంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.

వర్షం 4
మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో భారీగా పంట, ఆస్తి నష్టం వాటిల్లుతోంది. ఒకటి రెండు రోజులు వర్షాలు ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

వర్షం 5
గత మూడు రోజులుగా ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది.

వర్షం 6
కోస్తాలో కుంభవృష్టితో జన జీవనం అతలాకుతలమైంది. రాయలసీమ, తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీగా కురుస్తున్నాయి. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో భారీగా పంట, ఆస్తి నష్టం వాటిల్లుతోంది.

వర్షం 7
తుంగభద్ర దిగువ కాలువకు కర్ణాటక పరిధిలోని మోకా వద్ద 25 మీటర్ల మేర గండి పడింది. కాలువలోని నీరంతా వృథాగా పోయింది.

వర్షం 8
వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు నిండుకుండలయ్యాయి. అదనంగా వచ్చే నీటిని భరించలేక... గట్లు తెగుతున్నాయి.

వర్షం 9
విజయనగరం జిల్లాలో 11 చెరువులకు గండ్లుపడ్డాయి. జంఝావతి ప్రాజెక్టు, వెంగళరాయసాగర్ కాలువలకు గండ్లు పడ్డాయి. నదుల్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. వెంగళరాయ సాగర్, సువర్ణముఖి, తోటపల్లి, వట్టిగెడ్డ జలాశయాల గేట్లు ఎత్తారు.

వర్షం 9
విశాఖ జిల్లాలో ఆరు చెరువులకు గండ్లుపడ్డాయి. జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లు పెద్దేరు, కోనాం, రైవాడలో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు.

వర్షం 10
గుంటూరు జిల్లాలో నల్లమడ, ఓగేరు, అప్పాపురం చానల్, ఎద్దువాగు, కుప్పగంజి, కొండవీడు తదితర వాగులు పొంగిపొర్లుతున్నాయి.

వర్షం 11
ప్రకాశం జిల్లా కొమ్మూరు కాలువ ధ్వంసమైంది. వివిధ ప్రాంతాల్లో ఏకంగా 20 చోట్ల గండ్లుపడ్డాయి. దీంతో నీరంతా వరి పొలాలను ముంచెత్తింది. జిల్లాలోని పదికిపైగా చెరువులకు గండ్లుపడ్డాయి. గుండ్లకమ్మ ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తారు.

వర్షం 12
కోస్తాలో కుంభవృష్టితో జన జీవనం అతలాకుతలమైంది. రాయలసీమ, తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీగా కురుస్తున్నాయి. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో భారీగా పంట, ఆస్తి నష్టం వాటిల్లుతోంది.

వర్షం 13
మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో భారీగా పంట, ఆస్తి నష్టం వాటిల్లుతోంది. ఒకటి రెండు రోజులు వర్షాలు ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

వర్షం 14
కోస్తాలో కుంభవృష్టితో జన జీవనం అతలాకుతలమైంది. రాయలసీమ, తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీగా కురుస్తున్నాయి. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో భారీగా పంట, ఆస్తి నష్టం వాటిల్లుతోంది.

వర్షం 15
అల్పపీడన ప్రభావంతోపాటు రుతుపవనాలు చరుగ్గా కదలడంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కడప జిల్లాను ముంచెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా గురువారం సగటున 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.

వర్షం 16
వర్షాలతో వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఎగువ నుండి వరద పోటెత్తడంతో సగిలేరు ప్రాజెక్టుకు సామర్థ్యానికి మించి నీరు చేరింది. దీనితో గేట్లు ఎత్తివేశారు.

వర్షం 17
మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో భారీగా పంట, ఆస్తి నష్టం వాటిల్లుతోంది. ఒకటి రెండు రోజులు వర్షాలు ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

వర్షం 18
భారీగా కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మూడు వందల ఇళ్లు పాక్షికంగా, పూర్తిగా దగ్ధమైనట్లు మంత్రి రఘువీరా రెడ్డి గురువారం చెప్పారు.

వర్షం 19
బంగాళఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి, ఈశాన్య రుతుపవనాల వల్ల ఏర్పడ్డ తుఫాన్ మహబూబ్‌నగర్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది.

వర్షం 20
రహదారులపైకి ఎక్కి ప్రవహిస్తున్న వరద నీటితో ప్రయాణికులు ప్రమాదంలో చిక్కుకోకుండా అధికారులు పోలీసులను ఏర్పాటు చేసి రవాణా వ్యవస్థను నియంత్రించారు. ఓ బస్సు దిగబడిన దృశ్యం.

వర్షం 21
భారీ వర్షం ప్రభావం రైల్వే వ్యవస్థ పైన కూడా పడింది. పలు రైళ్లు రద్దయ్యాయి. విశాఖపట్నంలో రైళ్లు నిలిచిపోయాయి. ఓ బోగీ పట్టాలపై నుండి జారిన దృశ్యం.

వర్షం 22
భారీ వర్షం ప్రభావం రైల్వే వ్యవస్థ పైన కూడా పడింది. పలు రైళ్లు రద్దయ్యాయి. విశాఖపట్నంలో రైళ్లు నిలిచిపోయాయి. ఓ బోగీ పట్టాలపై నుండి జారింది.

వర్షం 23
భారీ వర్షం ప్రభావం రైల్వే వ్యవస్థ పైన కూడా పడింది. పలు రైళ్లు రద్దయ్యాయి. విశాఖపట్నంలో రైళ్లు నిలిచిపోయాయి. ఓ బోగీ పట్టాలపై నుండి జారింది.

వర్షం 24
వర్షం ప్రభావం రైల్వే వ్యవస్థ పైన కూడా పడింది. పలు రైళ్లు రద్దయ్యాయి. విశాఖపట్నంలో రైళ్లు నిలిచిపోయాయి. ఓ బోగీ పట్టాలపై నుండి జారింది. గుమికూడిన జనం.

Click it and Unblock the Notifications