విశాఖలో పుణె Vs పంజాబ్: సర్వం సిద్ధం, కవర్లు కప్పారు (ఫోటోలు)
అమరావతి: గత రెండు రోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతులమైన విశాఖపట్నం క్రికెట్ స్టేడియంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి వర్షం తెరపివ్వడంతో చకచకా పనులు ఊపందుకున్నాయి. శనివారం సాయంత్రం 4 గంటలకు పుణె, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌కు సర్వం సిద్ధం చేస్తున్నారు.
వర్షం పడటంతో మైదానం నిండా వేసిన టార్పాలిన్లు తొలగించారు. పిచ్ పరిసర ప్రాంతాల్లో రోలార్‌తో తొక్కుతూ తడిని పీల్చే పనులను సిబ్బంది చేస్తున్నారు. టార్పాలిన్లపై ఉన్న నీటిని కూడా తోడారు. మైదానంలో భూగర్భ డ్రైయినేజీ వ్యవస్థ పక్కగా ఉండడంతో వర్షపు నీరంతా కింది భాగం నుంచి బయటకు వెళ్లిపోయింది.
మైదానంలో ఉన్న పచ్చగడ్డిపై తడి ఆరిపోయింది. ఔట్ ఫీల్డ్ కాస్త తడిగా ఉన్నాదాదాపు తొంభై శాతం మేర మైదానం సిద్ధమైంది. శనివారం సాయంత్రం మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వర్షం కారణంగా స్డేడియంలో ఉన్న పైగ్యాలరీలో కొత్తగా ఏర్పాటు చేసిన మీడియా బాక్సులోని డొల్లతనం బయటపడింది.
ఏసీఏ లక్షలాది రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ బాక్సు గత రెండు రోజులుగా కురిసిన వర్షానికి పైకప్పునకు చేసిన సీలింగ్ ఊడిపోయి కింది పడింది. థర్మకోల్ షీట్ల ముక్కులు, ఇతర సామాగ్రి బాక్స్‌లో ఉన్న బెంచీలు, కూర్చీలపై పడిపోయాయి. దీంతో హుటాహుటిన మీడియా బాక్సుకు మరమ్మత్తులు చేపట్టారు.
బాక్సు చుట్టూ అద్దాలతో ఏర్పాటు చేయడం, వాటిని సరిగ్గా అమర్చకపోవడంతో వర్షపు నీరు దాని లోపలికి వెళ్లింది. దీంతో బాక్సు గోడకు రంధ్రం ఆ నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేశారు.

విశాఖలో పుణె Vs పంజాబ్
గత రెండు రోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతులమైన విశాఖపట్నం క్రికెట్ స్టేడియంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి వర్షం తెరపివ్వడంతో చకచకా పనులు ఊపందుకున్నాయి. శనివారం సాయంత్రం 4 గంటలకు పుణె, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌కు సర్వం సిద్ధం చేస్తున్నారు.

విశాఖలో పుణె Vs పంజాబ్
వర్షం పడటంతో మైదానం నిండా వేసిన టార్పాలిన్లు తొలగించారు. పిచ్ పరిసర ప్రాంతాల్లో రోలార్‌తో తొక్కుతూ తడిని పీల్చే పనులను సిబ్బంది చేస్తున్నారు. టార్పాలిన్లపై ఉన్న నీటిని కూడా తోడారు. మైదానంలో భూగర్భ డ్రైయినేజీ వ్యవస్థ పక్కగా ఉండడంతో వర్షపు నీరంతా కింది భాగం నుంచి బయటకు వెళ్లిపోయింది.

విశాఖలో పుణె Vs పంజాబ్
మైదానంలో ఉన్న పచ్చగడ్డిపై తడి ఆరిపోయింది. ఔట్ ఫీల్డ్ కాస్త తడిగా ఉన్నాదాదాపు తొంభై శాతం మేర మైదానం సిద్ధమైంది. శనివారం సాయంత్రం మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వర్షం కారణంగా స్డేడియంలో ఉన్న పైగ్యాలరీలో కొత్తగా ఏర్పాటు చేసిన మీడియా బాక్సులోని డొల్లతనం బయటపడింది.

విశాఖలో పుణె Vs పంజాబ్
ఏసీఏ లక్షలాది రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ బాక్సు గత రెండు రోజులుగా కురిసిన వర్షానికి పైకప్పునకు చేసిన సీలింగ్ ఊడిపోయి కింది పడింది. థర్మకోల్ షీట్ల ముక్కులు, ఇతర సామాగ్రి బాక్స్‌లో ఉన్న బెంచీలు, కూర్చీలపై పడిపోయాయి. దీంతో హుటాహుటిన మీడియా బాక్సుకు మరమ్మత్తులు చేపట్టారు.

విశాఖలో పుణె Vs పంజాబ్
బాక్సు చుట్టూ అద్దాలతో ఏర్పాటు చేయడం, వాటిని సరిగ్గా అమర్చకపోవడంతో వర్షపు నీరు దాని లోపలికి వెళ్లింది. దీంతో బాక్సు గోడకు రంధ్రం ఆ నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేశారు.

Click it and Unblock the Notifications