వాయుగుండంగా మారిన అల్పపీడనం: విశాఖలో ఒక్కసారిగా మారిన వాతావరణం

విశాఖ: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది విశాఖకు 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర, విశాఖ తదితర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

కొస్తా జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తీరం వెంట 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. 72 గంటల తర్వాత ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.

Rain likely in most parts of Odisha, AP from Thursday

కాగా, వాయుగుండం ముందుగా అంచనా వేసినట్లు కాకుండా వాయువ్య దిశగా పయనించనుందని, దీంతో దీని ప్రభావం ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ల పైన తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ బుధవారం రాత్రి విడుదల చేసింది.

అంచనాల ప్రకారం అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారాక, కోస్తాంధ్రపై ప్రభావం చూపుతుందని, ఫలితంగా కోస్తాంధ్రలో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. రానున్న రెండు రోజుల్లో కోస్తాంధ్రలోని కొన్నిచోట్ల, రాయలసీమలో తేలికపాటు నుంచి మోస్తారు, ఉత్తర కాస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+