కీలక విషయాన్ని వెల్లడించిన వాతావరణశాఖ

ఆగస్టులో వర్షాలు పడాల్సింది పోయి ఎండలు మండిపోతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండలకు తోడు ఉక్కపోత తీవ్రంగా ఉంది. నైరుతి రుతుపవనాలవల్ల జూన్ లో మోస్తరుగా, జులైలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఆ తర్వాత నుంచి వాతావరణం మారిపోయింది. ఆగస్టులో రికార్డుస్థాయి వర్షాలు కురవాల్సిందిపోయి రికార్డుస్థాయి ఎండలు నమోదువుతున్నాయి.

వచ్చే నెల మొదటి వారం నుంచి వానలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఆగస్టులో దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో కుండపోత వానలు కురిశాయి. అయితే రుతుపవన ద్రోణి దక్షిణాది వైపు కదలకపోవడంతో నైరుతి రుతుపవనాలు బలహీనమయ్యాయి. దీనివల్లే ఏపీ సహా అన్ని రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి.

rains in ap.. imd update news

ఈ ద్రోణి ప్రభావం సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఏపీపై ఉంటుందని, ప్రక్రియ మొదలైన నాలుగు రోజులకు రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలియజేస్తున్నారు. రుతుపవన ద్రోణి ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడి సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. సెప్టెంబరు నెలలో ఏపీ వ్యాప్తంగా సాధారణ వర్షపాతం లేదంటే అంతకు మించి నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు.

ఆగస్టు నెల ఎండాకాలాన్ని తలపిస్తోంది. జనాలు తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు. కొన్ని జిల్లాల్లో సాయంత్రం వరకు ఎండలు.. ఆ తర్వాత వానలతో ఒక్క సారిగా వాతావరణం మారిపోతూ వస్తోంది. ఒక గంట సమయం భారీగా వర్షం కురిస్తే ఆ తర్వాత వెంటనే ఎండ కాస్తోంది. ఇటువంటి చిత్రమైన వాతావరణంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+