Raisina Dialogue 2026: అప్పుడు తిట్టినోళ్లే ఇప్పుడు-చంద్రబాబు కామెంట్స్..!
భారత్ శరవేగంగా అభివృద్ధి వైపు, సాంకేతికత వైపు దూసుకు వెళ్తోందని సీఎం చంద్రబాబు (Chandrababu)తెలిపారు. మూడు దశాబ్దాల క్రితం అందిపుచ్చుకున్న ఐటీ విప్లవం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు తెలుగు రాష్ట్రాల నుంచి నిపుణులను అందించిందన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్ 2026 సదస్సు (raisina dialogue 2026)కు సీఎం చంద్రబాబు ఇవాళ హాజరయ్యారు. నాలెడ్జి ఎకానమీలో లీడింగ్ భాగస్వామిగా భారత్ ఉందన్నారు. 60 శాతం జీసీసీలు భారత్ లో ఏర్పాటు అయ్యాయని గుర్తుచేశారు. డిజిటల్ కరెన్సీ సంస్కరణల ద్వారా యూపీఐ పేమెంట్ వ్యవస్థ కూడా కీలకంగా మారిందన్నారు. గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందని తెలిపారు. క్వాంటం కంప్యూటింగ్ ను అందిపుచ్చుకునేలా అమరావతిని క్వాంటం వ్యాలీగా మారుస్తున్నామని తెలిపారు.
ఐటీ విప్లవం అందిపుచ్చుకున్నప్పుడు తనను అంతా విమర్శించారని, కానీ ఇప్పుడు హైదరాబాద్ నాలెడ్జి ఎకానమీకి కేంద్రంగా మారిందన్నారు. అలాగే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గేమ్ చేంజర్ గా మారబోతోందన్నారు. ఏఐ, క్వాంటం కంప్యూటర్లను ఎలా వినియోగించుకుంటామన్న అంశం ఆధారంగానే వాటి భవిష్యత్తు మారుతుందన్నారు. సైబరాబాద్ తో పాటు అమరావతిని బ్లూ గ్రీన్ సిటీగా నిర్మించే అవకాశాన్ని భగవంతుడు తనకు కల్పించాడన్నారు. గతంలో భారతీయ నిపుణులు సిలికాన్ వ్యాలీ లాంటి చోటకు మేధో వలస జరిగిందని, కానీ త్వరలో రివర్స్ మైగ్రేషన్ మొదలవుతుందన్నారు.భారత్ లో ప్రస్తుతం సింగిల్ గ్రిడ్ ద్వారా ఎనర్జీ ట్రాన్సఫర్మేషన్ జరుగుతోందని, గ్రీన్ ఎనర్జీ కారిడార్ తో పాటు ఇతర సంప్రదాయ విద్యుత్ కారిడార్ లు ఉంటాయన్నారు.

ఏఐ సహా క్వాంటం ఏఐ ఆల్గారిథమ్స్ కోసం పెద్ద ఎత్తున అవకాశాలు ఉంటాయని చంద్రబాబు తెలిపారు. ఇటీవల ట్రైనింగ్ కోసం కోసం పిలుపు ఇస్తే 50 వేల మంది రిజిస్టర్ చేసుకుని శిక్షణ పొందుతున్నారని, ఏజింగ్ సమస్యను ఎదుర్కొంటున్న దేశాలు జనాభా నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకే ఫెర్టిలిటీ రేటును పెంచేలా పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని రూపొందించామన్నారు. భారత్ లో గతంలో పెద్ద కుటుంబ వ్యవస్థలు ఉండేవని, దేశానికి అదో పెద్ద ఆస్తి కూడా అని, కానీ ప్రస్తుతం మైక్రో ఫ్యామిలీలుగా మారాయన్నారు. ఈ విషయంలో ప్రజల దృష్టి కోణం మార్చాలన్న ప్రయత్నంలో ఉన్నామన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు ఉన్నత స్థానాల్లో ఉండడానికి 30 ఏళ్ల క్రితం తీసుకున్న వివిధ సంస్కరణలతో కూడిన నిర్ణయాలే కారణమని, నాలెడ్జి ఎకనామీ ద్వారా ప్రపంచ దేశాలకు నైపుణ్యాలను అందిస్తున్నామని తెలిపారు. త్వరలోనే ప్రొడక్ట్ పర్ఫెక్షన్ ద్వారా ప్రపంచానికి అత్యుత్తమ ఉత్పత్తులను సరఫరా చేస్తామన్నారు. 9 అంశాలతో కూడిన నగరాలను అమరావతిలో ఏర్పాటు చేస్తున్నాం. క్రియేటివ్ సిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.ప్రైవేటు శాటిలైట్లను కూడా తయారు చేసి లాంచ్ చేసేలా ఓ స్పేస్ సిటీని, డ్రోన్ల కోసం డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎలక్ట్రానిక్స్, ఏరో స్పేస్ సిటీని ఏర్పాటు చేసి పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్నారు.
-
టీడీపీ ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు సీరియస్-తక్షణం..! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు -
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్-బకాయిలపై చంద్రబాాబు ఆదేశాలు..! -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు











Click it and Unblock the Notifications