రాజమండ్రి విమానాశ్రయానికి టంగుటూరి పేరు

బంధుప్రీతికి, అవినీతికి టంగుటూరి దూరంగా ఉండేవారన్నారు. ఉమ్మడి మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు టంగుటూరి ఎలా ధైర్యంగా ముందుకు వెళ్లారో ప్రస్తుతం మనమూ అలాగే ముందుకెళ్లాలన్నారు. టంగుటూరి స్ఫూర్తితో ముందుకెళ్లి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం చేసుకుందామని పిలుపునిచ్చారు.
టంగుటూరి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించినట్లు తెలిపారు. రాజమండ్రి విమానాశ్రయానికి, రాష్ట్రానికి రాబోతున్న ఏయిమ్స్‌కు ఆంధ్రకేసరి పేరు పెట్టాలని కేంద్రానికి సిఫార్సు చేయనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.
అంతకు ముందు రవీంద్రభారతి, అసెంబ్లీ ఆవరణల్లో ఉన్న టంగుటూరి విగ్రహానికి పూలమాలలు వేసి చంద్రబాబు నివాళులర్పించారు. టంగుటూరి ప్రకాశం పంతులు మనవడి భార్య టంగుటూరి కృష్ణకుమారి శనివారం ఎన్టీఆర్ భవన్‌కు వచ్చి మర్యాదపూర్వకంగా బాబును కలిశారు.












Click it and Unblock the Notifications