రాజమండ్రి నుంచి ఢిల్లీ వెళ్లే వారికి గుడ్ న్యూస్..!
రాజమండ్రి నుంచి ఢిల్లీకి వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఇండిగో ఎయిర్ లైన్స్ ఇవాళ రాజమండ్రి నుంచి ఢిల్లీకి డైరెక్ట్ విమాన సర్వీసును ప్రారంభించింది. రాజమండ్రి మధురపూడి ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టుకు ఇకపై నేరుగా విమానాలు నడవబోతున్నాయి. ఇవాళ ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి రాజమండ్రి విమానాశ్రయానికి డైరెక్ట్ ఫ్లైట్ వచ్చింది. అనంతరం రాజమండ్రి నుంచి ఢిల్లీ డైరెక్ట్ ఫ్లైట్ ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లింది.
రాజమండ్రి ఎంపీగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారంతో ఇండిగో సంస్ధతో మాట్లాడి ఈ డైరెక్ట్ సర్వీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం రాజమండ్రి నుంచి ఢిల్లీ వెళ్లాలంటే విశాఖకో, విజయవాడకో వెళ్లి ఎక్కుతున్న వారంతా ఇకపై నగరం నుంచే రాకపోకలు సాగించనున్నారు. దేశవ్యాప్తంగా 50 అదనపు ఎయిర్ పోర్టుల నిర్మాణం, విమానాల రాకపోకలు పెంచేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా రాజమండ్రి నుంచి సర్వీసులు పెంచుతున్నారు.

ఇదే క్రమంలో తాజాగా రాజమండ్రి నుంచి ముంబైకి డైరెక్ట్ ఫ్లైట్ అందుబాటులోకి తెచ్చారు. ఇవాళ రాజమండ్రి నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లైట్ ను అందుబాటులోకి తెచ్చారు. ఇలా డైరెక్ట్ విమానాల రాకతో రాజమండ్రి నుంచి ఆయా నగరాలకు వెళ్లే వారి సంఖ్య కూడ పెరకబోతోంది. ముఖ్యంగా ఢిల్లీకి రాజకీయ అవసరాల కోసం, ఇతరత్రా అవసరాల కోసం వెళ్లే వారు, అలాగే ముంబైకి వాణిజ్య అవసరాల కోసం వెళ్లే వారి సంఖ్య కూడా పెరకబోతోంది.












Click it and Unblock the Notifications