సీఎం జగన్ మాటలు గుండెను తాకాయి- మేకపాటి ఎమోషనల్ : రుణపడి ఉంటాం..!!

ఏపీ అసెంబ్లీలో మేకపాట్ గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. సభా వేదికగా ఎమ్మెల్యేలు గౌతమ్ వ్యక్తిత్వాన్ని...ఆయన శైలిని కొనియాడారు. పరిశ్రమల శాఖా మంత్రిగా గౌతమ్ చేసిన సేవలను కీర్తించారు. ఎమ్మెల్యే రోజా తనకు అన్న లాంటి గౌతమ్ ఇక లేరనే విషయం జీర్ణించుకోలేకపోతున్నానంటూ కన్నీరు పెట్టారు. అదే సమయంలో తీర్మానం ప్రవేశ పెట్టిన సీఎం జగన్ తనకు గౌతమ్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గౌతమ్ తన కంటే ఒక ఏడాది పెద్ద అయినా.. తనకు చిన్ననాటి నుంచి స్నేహితుడని చెప్పుకొచ్చారు.

Recommended Video

    Andhra Pradesh: Mekapati Goutham Reddy స్థానంలో మంత్రిగా ఎవరు ? | Oneindia Telugu
    సీఎం జగన్ ఆసక్తి కర అంశాలతో

    సీఎం జగన్ ఆసక్తి కర అంశాలతో


    తాను కాంగ్రెస్ ను వీడి బయటకు వచ్చిన సమయంలో తనతో కలిసి నడవటానికి ముందుకొచ్చిన వారిలో గౌతమ్ ఉన్నారని గుర్తు చేసుకున్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి సైతం కాంగ్రెస్ కు రాజీనామా చేసి..తనతో పాటుగా ఎంపీగా పోటీ చేసిన సమయంలో గౌతమ్ కీలక పాత్ర పోషించారని వివరించారు. అదే విధంగా మంత్రిగా బాగా పని చేసారని.. దుబాయ్ లో ఉన్న సమయంలోనూ అక్కడి నిర్ణయాలను ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇచ్చేవారని..అటువంటి వ్యక్తిని కోల్పోవటం తనకు వ్యక్తిగతంగా ఎంతో నష్టమన్నారు. తమ పార్టీకి సంబంధించిన ప్రతీ ఒక్కరు మేకపాటి కుటుంబానికి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

    రాజమోహన్ రెడ్డి కోరినట్లుగా

    రాజమోహన్ రెడ్డి కోరినట్లుగా

    అదే సమయంలో తాను గౌతమ్ మరణించిన సమయంలో వెళ్లగా.. ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి కొన్ని అంశాలను తనతో ప్రస్తావించి..వాటిని నెరవేర్చాలని కోరారని..చెబుతూ వాటిని అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఉదయగిరిలో మేకపాటి కాలేజిని గౌతమ్ హార్టికల్చరల్ కాలేజీగా ..అదే విధంగా ఉదయగిరిలో ఇంజనీరింగ్‌ కళాశాలను అభివృద్ధి చేస్తామని చెప్పడంతో పాటుగా సంగం బ్యారేజీని వేగంగా పూర్తిచేసి దానికి గౌతమ్‌ పేరు పెడతానని ముఖ్యమంత్రి సభలో ప్రకటించారు. దీని పైన మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పందించారు. సీఎం జగన్ సభలో మాట్లాడిన మాటలు తమ గుండెను తాకాయంటూ ఎమోషనల్ అయ్యారు. ముఖ్యమంత్రి మాటలు తమకు మనో ధైర్యాన్ని నింపాయని పేర్కొన్నారు.

    సీఎం మాటలు గుండెను తాకాయంటూ

    సీఎం మాటలు గుండెను తాకాయంటూ

    గౌతమ్‌రెడ్డి ఆశయాలను నెరవేరుస్తామని శాసనసభ వేదికగా ప్రకటించిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని తెలిపారు. మృతజీవనుడంటూ గౌతమ్‌కు సంతాపం వ్యక్తం చేసిన స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు ధన్యవాదాలు తెలిపారు. జగన్‌కు వెన్నంటి ఉన్న గౌతమ్‌రెడ్డికి అసలైన నివాళి తెలిపారన్నారు. గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో చేయలేకపోయిన సోమేశ్వర ఆలయం, సోమశిల ప్రాజెక్టుల విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

    ఆత్మకూరు బై పోల్ పై అప్పుడే నిర్ణయం

    ఆత్మకూరు బై పోల్ పై అప్పుడే నిర్ణయం

    గౌతమ్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని తలుచుకుంటూ సభలో సంతాపం వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికి రాజమోహన రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అయితే, రాజకీయంగానూ ఆ కుటుంబానికి ఆత్మకూరు ఎన్నికల్లో ప్రాధాన్యత ఇచ్చే అంశం పైన పార్టీలో చర్చ సాగుతోంది. ఉప ఎన్నిక వచ్చిన సమయంలో కుటుంబం నుంచి ఎవరైనా పోటీకి సిద్దంగా ఉంటారా అనే అంశం పైన మేకపాటి కుటుంబంతో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+