వైఎస్ జగన్ సొంత జిల్లా, రాజంపేట ఎమ్మెల్యే ఆ పదవికి రాజీనామా, రేసులో ఎవరు?
వైసీపీ చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఉమ్మడి కడప జిల్లా జెడ్పీ ఛైర్మన్ పదవి ఎవరిని వరిస్తుంది ? అని అందరికి టెన్షన్ మొదలైయ్యింది. ఉమ్మడి కడప జిల్లా పరిషత్తు ఛైర్మన్ పదవికి ఆకేపాటి అమరనాథ రెడ్డి రాజీనామా చెయ్యడంతో ఆ పదవి మీద పలువురు నాయకులు కన్ను వేశారు.
మే 13వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజంపేట నియోజక వర్గం నుంచి పోటీ చేసిన ఆకేపాటి అమరనాథ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జేడ్సీ చైర్మన్ పదవిలో ఉంటూ ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన ఆకేపాటి అమరనాథ రెడ్డి ఆయన పదవికి రాజీనామా చేశారు. జిల్లా కలెక్టర్ విజయరామరాజును కలిసిన ఆకేపాటి అమరనాథ రెడ్డి జేడ్పీ ఛైర్మన్ పదవికి రాజీనా చేసిన లేఖను అందించారు.

అంతకు ముందు పలువురు జడ్పీటీసీ అసభ్యులు, స్థాయి సంఘం సంఘాల సమావేశాలు నిర్వహించిన అనంతరం ఆకేపాటి అమరనాథ రెడ్డి ఆయన పదవికి రాజీనామా చేశారు. ఉమ్మడి కడప జిల్లా తదుపరి జడ్పీ ఛైర్మన్ ఎవరు అనే విషయంపై ఇదే సమావేశంలో ఆకేపాటి అమరనాథ రెడ్డి చర్చించారని తెలిసింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే.
పులివెందుల రూరల్ జడ్పీటీసీ అభ్యుడు చరిపోవడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. ఆమేపాటి అమరాథ రెడ్డి రాజీనామాతో ఒట్టిమిట్ట జడ్పీటీసీ సభ్యుడి ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ సందర్బంగా కడప జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. పులివెందల నియోజక వర్గం చక్రాయపేట జడ్పీటీసీ సభ్యుడు శివప్రసాద్ రెడ్డి కడప జిల్లా జడ్పీటీసీ ఛైర్మన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. మొత్తం మీద ఉమ్మడి కడప జిల్లా జడ్పీటీసీ ఛైర్మన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.












Click it and Unblock the Notifications