ఆ యాగం - జగన్ కు మరోసారి సీఎం యోగం : కేసీఆర్ సూచన - గెలుపు పక్కా..!!
వై నాట్ 175. ఈ సారి అధికారంలోకి వస్తే మరో 30 ఏళ్లు అధికారం మనదే. ముఖ్యమంత్రి జగన్ పదే పదే చెబుతున్న మాటలివి. గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్న సీఎం జగన్ తాను నమ్ముకున్నది ఆ దేవుడిని. ఈ ప్రజలను అని చాలా నమ్మకంగా ఉన్నారు. సీఎం జగన్ 2019 నుంచి ఇప్పటి వరకు ఆధ్మాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా విశాఖ శారదా పీఠం పైన సీఎం జగన్ కు నమ్మకం ఎక్కువ. అక్కడ నిర్వహించే రాజశ్యామల యాగంలో సీఎం జగన్ పాల్గొంటున్నారు. ఆ యాగంతో తిరిగి సీఎంగా జగన్ అధికారం ఖాయమని నిర్వాహకులు నమ్ముతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఈ యాగం ఒక సెంటిమెంట్. ప్రతీ ముఖ్యమైన కార్యక్రమం సమయంలో ఈ యాగం చేస్తారు. గతంలో కేసీఆర్ చేసిన సూచనల మేరకే సీఎం జగన్ ప్రతీ ఏటా ఈ యాగంలో పాల్గొంటున్నారు.

2019 ఎన్నికల ప్రచారంలోనూ యాగం
విశాఖ శారదాపీఠంలో వార్షికోత్సవాలు ప్రతీ ఏటా ప్రత్యేక పూజలతో నిర్వహిస్తారు. వార్షికోత్సవాల వేళ చివరి రోజున రాజశ్యామల యాగం చేయటం ఆనవాయితీ. 2023లో కూడా పీఠం వార్షికోత్సవాలు ఉన్నాయి. జనవరి 27 నుంచి 31 వరకూ అయిదు రోజుల పాటు జరిగే వార్షికోత్సవాలలో భాగంగా మరోసారి రాజశ్యామల యాగం చేయనున్నారు. వార్షికోత్సవాలకు సంబంధించి శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ని తాడేపల్లిలోని ఆయన క్యాంప్ ఆఫీసులో కలిసారు. ఆహ్వాన పత్రం అందచేశారు. జగన్ తొలి నుంచి శారదా పీఠం స్వామజీ స్వరూపానందేంద్ర స్వామీజీ అంటే నమ్మకం. 2019 ఎన్నికల సమయంలోనూ పార్టీ ఎంపీ ఒకరు నెల్లూరు కేంద్రంగా రాజశ్యామల యాగం నిర్వహించారు. 2019 ఎన్నికల్లో జగన్ విజయం సాధించారు.

కేసీఆర్ కు నమ్మకం.. సీఎం జగన్ కు సూచన
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రతీ ఏటా విశాఖ శారదా పీఠంలో జరిగే కార్యక్రమాలకు హాజరు అవుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజశ్యామల యాగం పైన మంచి గురి ఉంది. ప్రతీ ముఖ్యమైన కార్యక్రమం వేళ ఈ యాగం కేసీఆర్ ఖచ్చితంగా నిర్వహిస్తారు. కేసీఆర్ వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చినా రాజశ్యామల యాగం నిర్వహణ కొనసాగిస్తున్నారు. తాజాగా.. బీఆర్ఎస్ ప్రకటించిన కేసీఆర్.. ఢిల్లీ కేంద్రంగా ఈ యాగం నిర్వహణతోనే పార్టీ కార్యాలయం ప్రారంభించారు. సీఎం జగన్ - సీఎం కేసీఆర్ సన్నిహిత సంబంధాలు కొనసాగిన రోజుల్లో ఇద్దరూ స్వరూపానందేంద్ర అమరావతిలో నిర్వహించిన యాగంలో పాల్గొన్నారు. అదే విధంగా విశాఖకు వచ్చి సీఎం కేసీఆర్ స్వామి స్వరూపానంద నిర్వహించిన యాగంలో పాల్గొన్నారు. అప్పట్లోనే ముఖ్యమంత్రి జగన్ కు ఈ యాగం గురించి కేసీఆర్ సూచించారని..ప్రతీ ఏటా నిర్వహించాలని సూచించారని సమాచారం.

యాగం..రెండో సారి సీఎంగా యోగం
రాజ్యాన్ని కాంక్షించే వారు విజయాలను కోరుకునే వారు రాజశ్యామల యాగం చేస్తే సర్వం సిద్ధిస్తుందనేది ఒక నమ్మకం. 2019 లో జగన్ కోసం ఆ యాగం చేయటం..అధికారం దక్కటం జరిగాయి. ఇక, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలుపు కోసం వ్యూహాలు సిద్దం చేస్తున్న జగన్ ..ఇటు ఆధ్యాత్మికంగానూ రాజశ్యామల యాగంలో పాల్గొంటున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ఉప ఎన్నికలు..స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జగన్ ఏకపక్ష విజయం సాధించారు. దీంతో సీఎంతో పాటుగా మంత్రులు.. పార్టీ ప్రముఖులు తరచూ శారదా పీఠం సందర్శిస్తున్నారు. ఈ సారి జరిగే వేడుకల్లోనూ సీఎం పాల్గొంటారాని తెలుస్తోంది. దీని ద్వారా 2024లోనూ జగన్ కు అటు అమ్మవారి ఆశీస్సులు..ఇటు ప్రజా మద్దతుతో గెలుపు ఖాయమని పార్టీ నేతలు చెబుతున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications