హరీష్‌రావుకు షాక్: బారికేడ్లపై రాజభవన్ క్లారిటీ

హరీష్ రావు చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తూ రాజభవన్ నుంచి గురువారం ఓ ప్రకటన విడుదలైంది. చంద్రబాబు ప్రకటనను ఖండిస్తూ బారికేడ్ల ఏర్పాటు నిర్ణయం గవర్నర్‌దేనని హరీష్ రావు అన్నారు. హరీష్ రావు వాదనను వ్యతిరేకిస్తూ రాజభవన్ నుంచి ప్రకటన విడుదలైంది.
రాష్ట్రపతి పాలన సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సచివాలయాలను వేరు చేస్తూ బారికేడ్లను ఏర్పాటు చేయాలనే నిర్ణయం జరిగిందని మీడియాలో వార్తలు వస్తున్నాయని, రాష్ట్రపతి పాలన సమయంలో గవర్నర్ ఆ నిర్ణయం తీసుకున్నారని కూడా వార్తలు వచ్చాయని రాజభవన్ నుంచి విడుదలైన ప్రకటనలో అన్నారు.
ఆ విధమైన నిర్ణయమేదీ గవర్నర్ తీసుకోలేదని, అలా ఏర్పాటు చేయాలని ఆదేశాలు కూడా జారీ చేయాలని రాజభవన్ ప్రకటన స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications