వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్‌తో భేటీ: పవర్స్‌పై కేంద్రానికి రాజీవ్ శర్మ లేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

 Rajeev Sharma writes letter on powers to governor
హైదరాబాద్: గవర్నర్‌కు హైదరాబాద్‌పై కేంద్రం అధికారాలను కట్టబెట్టడంపై తెలంగాణ ప్రభుత్వం నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం లేఖ రాశారు. గవర్నర్ కు అధికారాలు సాధ్యం కాదని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని లేఖలో స్పష్టం చేశారు.

రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవద్దని సూచించారు. ఇతర రాష్ట్రాలతో వ్యవహరించే విధంగానే తెలంగాణ రాష్ట్రంలోనూ కేంద్ర వ్యవహరించాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర హక్కులకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని లేఖలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు చేయబోమని స్పష్టం చేశారు.

మంత్రి మండలి నిర్ణయాలకు అనుగుణంగానే గవర్నర్ నడుచుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ నియమ నిబంధనలకు లోబడే వ్యవహరిస్తోందని సీఎస్ లేఖలో అన్నారు. రాజీవ్ శర్మ శనివారంనాడు గవర్నర్ నరసింహన్‌తో కూడా సమావేశమయ్యారు. ఇదే విషయంపై ఆయన గవర్నర్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ శాంతిభద్రతలను గవర్నర్ చేతికి అప్పగించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారంనాడు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ లేఖపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీవ్రంగా మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం ఫాసిస్టులా వ్యవహరిస్తుందని విమర్శించారు.

English summary

 Telangana CS Rajeev Sharma has written letter to centre rejecting deligate powers of Hyderabad law and order to governor Narasimhan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X