తెరాసను హరీష్ చీల్చుతారు: రాజేంద్రప్రసాద్ సంచలనం

ఈ విషయం తెలియడం వల్లనే కెసిఆర్ తీవ్ర ఆందోళనతో.. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. సీమాంధ్రలో జగన్, తెలంగాణలో తాను అధికారంలోకి వస్తున్నామని కెసిఆర్ బీరాలు పలుకుతున్నారని, ఈ నెల 16న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక హైదరాబాద్ చార్మినార్ వద్ద కెసిఆర్ చిలుక జోస్యం చెప్పుకోవాల్సిందేన్నారు. తెలంగాణలో, సీమాంధ్రలో టిడిపియే అధికారంలోకి వస్తుందన్నారు. జగన్ జైలుకు, చంద్రబాబు సెక్రటేరియెట్‌కు వెళ్లడం ఖాయమన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి, మోడీ ప్రధాని కాగానే కెసిఆర్, జగన్ దోచుకున్న అవినీతి అక్రమాల సొమ్మును కక్కిస్తామన్నారు. అవినీతి, అక్రమాల్లో కవల సోదరులయిన జగన్, కెసిఆర్.. రెండు రాష్ట్రాలను దోచుకునేందుకు పన్నాగాలు పన్నుతున్నారన్నారు. అక్కడ జగన్‌తో, ఇక్కడ కెసిఆర్‌తో సోనియా గాంధీ మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నట్టు చాలా నెలలుగా తాము చెబుతున్న విషయాలను కెసిఆర్ ధ్రువీకరించారన్నారు.
తెరాసలో గెలిచే కొద్దిపాటి ఎమ్మెల్యేలు సైతం జంప్ అవుతారనే ఆందోళనతోనే కెసిఆర్ ఆవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. మేనల్లుడు హరీశ్ రావు నేతృత్వంలో తెరాస చీలనుందని, ఒకే సామాజికవర్గానికి చెందిన 15 మంది తెరాస అభ్యర్థులు దిగ్విజయ్ సింగ్‌తో టచ్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయన్నారు. అందువల్లనే కెసిఆర్ ఆందోళన చెందుతున్నారని, హరీశ్ పార్టీ చీల్చకుండా ఉండేందుకు కాంగ్రెస్‌కు, సోనియాకు, రాహుల్‌కు అనుకూలంగా ఫీలర్స్ వదులుతున్నారన్నారు.
వేయి మంది విద్యార్థులను బలితీసుకున్న బలిదేవత సోనియాతో కలుస్తానని చెబుతున్నారని మండిపడ్డారు. ఇదే పని సీమాంధ్రలో జగన్ చేస్తున్నారన్నరాు. అందుకే సోనియాకు జగన్ దత్తపుత్రుడని, కెసిఆర్ అద్దె పుత్రుడని చెబుతున్నామన్నారు. కెసిఆర్, జగన్‌ల డీఎన్ఏ ఒక్కటేనని, అందుకే వారిద్దరూ తిట్టుకోరన్నారు. 16వ తేదీన వచ్చే ఫలితాలతో ఇద్దరూ రెంటికీ చెడిన రేవడి అవుతారన్నారు.












Click it and Unblock the Notifications