మంత్రి రోజాకు రజినీకాంత్ ఫ్యాన్స్ సీరియస్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రజినీకాంత్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు వచ్చి చంద్రబాబును ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేయడంతో ఏపీలో రాజకీయ దుమారం మొదలైంది. అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రజనీకాంత్ చంద్రబాబు ని పొగుడుతూ వ్యాఖ్యలు చేయడాన్ని వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి.
వైసీపీ మంత్రులు చంద్రబాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన సందర్భంలో ఆయనకు మద్దతుగా రజనీకాంత్ వున్నాడని, అటువంటి రజినీకాంత్ ఎన్టీఆర్ గురించి మాట్లాడితే ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహం వస్తుందని వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా మంత్రి రోజా రజినీకాంత్ పై విరుచుకుపడ్డారు. రజనీకాంత్ ఏపీలో మాట్లాడిన వ్యాఖ్యలతో ఆయన జీరో అయిపోయారు అని మంత్రి రోజా పేర్కొన్నారు.

రాజకీయాలు వద్దు అనుకున్న రజినీకాంత్ కు ఏపీ రాజకీయాలతో ఏం పని ఉందని మంత్రి రోజా ప్రశ్నించారు. అంతేకాదు రజినీకాంత్ కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం తమకు లేదని, తాము చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని మంత్రి రోజా తేల్చిచెప్పారు. ఇక ఈ క్రమంలో మంత్రి రోజాకు సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ హెచ్చరికలు జారీ చేశారు.
రజినీకాంత్ ను విమర్శించే స్థాయి రోజాకు లేదని వారు పేర్కొన్నారు. రోజా తాను చేసిన విమర్శలకు వెంటనే రజినీకాంత్ కు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. పుదుచ్చేరిలో సమావేశమైన రజినీకాంత్ అభిమానసంఘం నేతలు మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై సీరియస్ గానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికైనా క్షమాపణ చెప్పకపోతే పెద్దఎత్తున నిరసనలు చేపడతామని, మరోమారు రజినీకాంత్ పై ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తేలేదని తేల్చి చెబుతున్నారు.
ఇటీవల పుదుచ్చేరిలో తిరు కంచి గంగై వరదరాజు నాదీశ్వర ఆలయంలో పుష్కరిణి వేడుకలలో పాల్గొన్న మంత్రి రోజా అప్పుడు కూడా రజినీకాంత్ పై వ్యాఖ్యలు చేశారు. రజినీకాంత్ పై ఎన్టీఆర్ అభిమానులు కోపంగా ఉన్నారని, రజనీకాంత్ ని టార్గెట్ చేస్తూ రోజా చేసిన వ్యాఖ్యలతో.. ఇక నోటికొచ్చినట్టు రజనీకాంత్ పై ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆయన ఫ్యాన్స్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కచ్చితంగా ఏపీ మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. లేదంటే తర్వాత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications