ఆయనకు మంత్రి పదవి కోసం చంద్రబాబుకు రజనీ సిఫార్సు..!!

ఏపీలో కొత్త ప్రభుత్వ పాలన మొదలైంది. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తున్నారు. మంత్రులు ఒక్కొక్కరుగా బాధ్యతలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు కేబినెట్ కూర్పు వెనుక చోటు చేసుకున్న ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సారి పలువురు సీనియర్లను చంద్రబాబు పక్కన పెట్టారు. ఇదే సమయంలో చంద్రబాబు మిత్రుడు హీరో రజనీ కాంత్ ఒక నేతకు మంత్రి పదవి కోసం సిఫార్సు చేసిన విషయం వైరల్ అవుతోంది.

రజనీ సిఫార్పు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి రజనీకాంత్ సతీ సమేతంగా హజరయ్యారు. గతంలోనూ విజయవాడలో చంద్రబాబు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న రజనీకాంత్ నాడు టీడీపీ అధినేత పైన ప్రశంసలు కురిపించారు. ఆ సమయంలో వైసీపీ నేతల విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక..చంద్రబాబు సీఎం అయిన తరువాత కొత్తగా ఏర్పాటయ్యే మంత్రివర్గంలో రజనీకాంత్ చిత్తూరు జిల్లాకు చెందిన ఒక నేత పేరు మంత్రిగా పరిశీలించాలని చంద్రబాబు కు సూచించారు. కానీ, రజనీ సూచించిన నేతకు మంత్రి పదవి దక్కలేదు. దీని వెనుక అనేక కారణాలున్నాయి.

Rajinikanth Recommends Chittoor leader name for Minister post to Chandra Babu goes viral

చిత్తూరు నేత కోసం
వైసీపీ నుంచి టీడీపీలో చేరి సత్యవేడు నుంచి గెలుపొందిన ఆదిమూలం పేరును మంత్రిగా పరిశీలించాలని రజనీకాంత్ నేరుగా చంద్రబాబును కోరినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే, పార్టీ నుంచి ఏకంగా 135 మంది గెలవటం..జనసేన, బీజేపీకి మంత్రులుగా అవకాశం ఇవ్వాల్సి ఉండటంతో చంద్రబాబు సామాజిక - ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా మంత్రివర్గ కూర్పు చేసారు. అందులో రజనీ సిఫార్సు చేసిన పేరు పరిశీలన సమయంలోనే చిత్తూరు జిల్లా నుంచి పలువురు ఆశావాహుల నుంచి ఒత్తిడి పెరిగింది.

చంద్రబాబు లెక్క
చిత్తూరు జిల్లాకు సంబంధించి పలమనేరు ఎంఎల్ ఎ అమర్‌నాథ్‌రెడ్డికి, అన్నమయ్య జిల్లా నుంచి నల్లారి కిషోర్ కూమార్‌రెడ్డికి అవకాశం వస్తుందని అందరు భావించారు. ఇద్దరు దిగ్గజ రాజకీయాల కుటుంబాల వారు కావడంతో ఖచ్చితంగా ఒకరికి వస్తుందని భావించారు. ఎస్సీ వర్గం నుంచి జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో రజనీకాంత్ సిఫార్సు చేసిన పేరు పైన చంద్రబాబు ఆలోచన చేసారు. ఎవరినీ కాదనలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. ఈ పరిస్థితులను రజనీకి చంద్రబాబు వివరించినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+